Telugu Global
National

ఆ దేశంలో టీవీ కన్నా కండోమ్‌ల‌ ధర చాలా ఎక్కువ!

ప్రపంచ వ్యాప్తంగా కండోమ్ ధరలు చాలా పరిమిత స్థాయిలో ఉండగా.. అనేక దేశాల్లో ప్రభుత్వాలు వీటిని ప్రజలకు ఉచితంగా ఇస్తున్నాయి కూడా. కానీ ఓ పాకెట్ కండోమ్ ధర 60 వేల రూపాయలంటే నమ్మలేం మరి..! కళ్ళు తిరిగే ఈ ధర ఓ లేటెస్ట్ మోడల్ టీవీ కన్నా ఎక్కువేనంటే అది వండర్ కాక మరేమిటి..? ఇంతకీ ఇంత ధర పలుకుతున్నది ఏ దేశంలో తెలుసా ? అబార్షన్ చట్ట విరుద్ధమని ప్రకటించిన వెనెజులాలో ! దాంతో […]

condoms-are-more-expensive-than-tv-in-venezuela-a-packet-costs-rs-60-thousand
X

ప్రపంచ వ్యాప్తంగా కండోమ్ ధరలు చాలా పరిమిత స్థాయిలో ఉండగా.. అనేక దేశాల్లో ప్రభుత్వాలు వీటిని ప్రజలకు ఉచితంగా ఇస్తున్నాయి కూడా. కానీ ఓ పాకెట్ కండోమ్ ధర 60 వేల రూపాయలంటే నమ్మలేం మరి..! కళ్ళు తిరిగే ఈ ధర ఓ లేటెస్ట్ మోడల్ టీవీ కన్నా ఎక్కువేనంటే అది వండర్ కాక మరేమిటి..? ఇంతకీ ఇంత ధర పలుకుతున్నది ఏ దేశంలో తెలుసా ? అబార్షన్ చట్ట విరుద్ధమని ప్రకటించిన వెనెజులాలో ! దాంతో సహజంగానే ఇలాంటి గర్భ నిరోధక సాధనాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వెనెజులాలోని ఓ స్టోర్ లో పాకెట్ కండోమ్ ధర 60 వేల రూపాయలని బోర్డు పెట్టినా.. వీటిని కొనేందుకు ప్రజలు అక్కడ ఎగబడుతున్నారట.

దేశంలో గర్భస్రావ చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ కారణంగా ఫార్మసీలు, సూపర్ మార్కెట్లలో కాంట్రాసెప్టివ్ లతో బాటు కండోమ్ లు దొరకడం కూడా గగనమైపోయింది. పైగా బ్లాక్ మార్కెట్లలో వీటి ధర ఇంకా రెట్టింపు ఉంటోంది. ఓ పాకెట్ కండోమ్ కొనాలంటే ఓ వ్యక్తి తన కిడ్నీ అమ్ముకోవాల్సిందేనట.. అందువల్లే లేటెస్ట్ మోడల్ టీవీ ధర కన్నా వీటి కాస్ట్ అబ్బో అనేలా ఉంది. లాటిన్ అమెరికా దేశాల్లో ఎక్కువగా టీనేజీలోనే ప్రెగ్నెన్సీ బారిన పడుతున్న యువతులు ఈ వెనెజులాలోనే ఉన్నారు. 2015 నాటి ఐరాస ప్రపంచ జనాభా నివేదిక ప్రకారం ఇదీ లెక్క ! కానీ ఇప్పుడది అంతలింతలుగా పెరిగిపోయింది. కండోములే కాదు.. గర్భనిరోధక పిల్స్ ధర కూడా ఈ దేశంలో చాలా ఎక్కువగా ఉంది.

అబార్షన్ నిబంధనలు ఎంత కఠినంగా ఉంటున్నాయంటే.. గర్భస్రావం చేయించుకున్న ఏ యువతి అయినా పట్టుబడితే ఆమెను అత్యంత కఠినంగా శిక్షిస్తారట. లోకల్ బ్రాండ్ పిల్స్ దొరుకుతున్నా అవి అంత సేఫ్ కాదని, అందువల్లే ఫారిన్ బ్రాండ్ పిల్స్ కాస్ట్ ఎంతయినా వాటిని కొనేందుకు బారులు తీరుతున్నారని స్టోర్ల యజమానులు చెబుతున్నారు.

పట్టుబడి జైళ్లకు వెళ్ళేబదులు ఇలా హెచ్చు ధర పెట్టి కండోమ్ లు కొనడమే బెటర్ అనే మనస్తత్వం వెనెజుల వాసుల్లో పెరిగిపోతోంది. కొంతమంది ఉద్యోగులు తమ కొచ్చే వేతనాల్లో సగానికి సగం సొమ్ము ప్రతినెలా వీటిని కొనేందుకే తగలేస్తున్నారని ఓ స్టడీ చెబుతోంది. సాధారణ కండోమ్ ధరే 60 వేలు పలుకుతుండగా కాస్త హై క్వాలిటీ గలవాటి ధరలు ఇంకా ఎక్కువేనట..

ఏమైనా ఈ న్యూస్ దేశంలోని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశంలో అబార్షన్ నిషిద్ధమని, ఎవరైనా ఈ నిషేధాన్ని అతిక్రమిస్తే వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలున్నాయని అధికారులు చాటింపు వేస్తున్నారు. ఇదెక్కడి అన్యాయమంటూ సాధారణ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కానీ వీరి గోడును వినే స్థితిలో ప్రభుత్వం లేదు.

First Published:  13 Jun 2022 6:28 AM GMT
Next Story