Telugu Global
MOVIE UPDATES

బ్రహ్మాస్త్రలో జాయిన్ అయిన మెగాస్టార్

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం `బ్రహ్మాస్త్ర`. తెలుగులో ఈ సినిమా “బ్రహ్మస్త్రం” పేరుతో రిలీజ్ కానుంది. రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ జంటగా నటిస్తున్నఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో ముందడుగు వేసి బ్రహ్మస్త్రం సినిమాకి వాయిస్ ఓవర్ అందించనున్నారు. “ఆ బ్రహ్మస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖలలో చిక్కుకుందన్న విషయం […]

chiranjeevi-voice-over-for-brahmastra
X

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'బ్రహ్మాస్త్ర'. తెలుగులో ఈ సినిమా “బ్రహ్మస్త్రం” పేరుతో రిలీజ్ కానుంది. రణ్‌బీర్‌ కపూర్‌, అలియాభట్‌ జంటగా నటిస్తున్నఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో ముందడుగు వేసి బ్రహ్మస్త్రం సినిమాకి వాయిస్ ఓవర్ అందించనున్నారు. “ఆ బ్రహ్మస్త్రం యొక్క విధి తన అరచేతి రేఖలలో చిక్కుకుందన్న విషయం ఆ యువకుడికే తెలియదు అతనే శివ” అని మెగాస్టార్ వాయిస్ తో స్టార్ట్ అయ్యే ట్రైలర్ జూన్ 15 న విడుదలకానుంది.

ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మూడు భాగాలుగా రాబోతుంది. అందులో మొదటి భాగం 'బ్రహ్మాస్త్ర పార్ట్-1ను ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు మేకర్స్.

స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మమైన సినిమాని సెప్టెంబర్ 9న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో రాజమౌళి ఈ సినిమాని సమర్పిస్తున్నాడు.

First Published:  13 Jun 2022 8:49 AM GMT
Next Story