Telugu Global
National

లాకప్ డెత్….. ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్‌ సహా ఐదుగురు పోలీసులు సస్పెండ్

తమిళనాడులో మరో లాకప్ డెత్ జరిగింది. చెన్నైలో ఆదివారం సాయంత్రం 30 ఏళ్ల వ్యక్తి పోలీసు కస్టడీలో మరణించాడు, రెండు నెలల్లో రాష్ట్రంలో ఇటువంటి సంఘటన ఇది రెండవది. 20కి పైగా క్రిమినల్ కేసులు ఉన్న తిరువళ్లూరు జిల్లాకు చెందిన రాజశేఖర్ అనే వ్యక్తిని కొడంగయ్యూరు పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసు కస్టడీలో ఉండగా అతని ఆరోగ్య క్షీణించిందని అతన్ని వెంటనే తాము ఆస్పత్రికి తరలించామని పోలీసులు చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స తర్వాత అతన్ని మళ్ళీ […]

chennai-man-dies-in-police-custody-2nd-case-in-2-months-5-cops-suspended
X

తమిళనాడులో మరో లాకప్ డెత్ జరిగింది. చెన్నైలో ఆదివారం సాయంత్రం 30 ఏళ్ల వ్యక్తి పోలీసు కస్టడీలో మరణించాడు, రెండు నెలల్లో రాష్ట్రంలో ఇటువంటి సంఘటన ఇది రెండవది.

20కి పైగా క్రిమినల్ కేసులు ఉన్న తిరువళ్లూరు జిల్లాకు చెందిన రాజశేఖర్ అనే వ్యక్తిని కొడంగయ్యూరు పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసు కస్టడీలో ఉండగా అతని ఆరోగ్య క్షీణించిందని అతన్ని వెంటనే తాము ఆస్పత్రికి తరలించామని పోలీసులు చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స తర్వాత అతన్ని మళ్ళీ పోలీసు స్టేషన్ కు తీసుకవెళ్ళారు.

అయితే పోలీసు స్టేషన్ కు వెళ్ళాక మళ్ళీ అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దాంతో అతన్ని ”ప్రభుత్వ స్టాన్లీ ఆసుపత్రి తీసుకెళ్ళాము. అయితే అప్పటికే రాజశేఖర్ చనిపోయినట్టు డాక్టర్లు ప్రకటించారు.” అని కొడంగయ్యూరు పోలీసులు ప్రకటించారు.

రాజశేఖర్ మరణం పై పెద్ద ఎత్తున నిరసనలు రాగా స్పంధించిన పోలీసు ఉన్నతాధికారులు వెంటనే చర్యలు చేపట్టారు.

“ఒక ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్‌తో సహా ఐదుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశాము” అని చెన్నై అదనపు పోలీసు కమిషనర్ టిఎస్ అన్బు తెలిపారు.

తమిళనాడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శైలేంద్రబాబు, రాజశేఖర్ మృతిపై క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీబీ-సీఐడీ) విచారణకు ఆదేశించారు.

రాజశేఖర్ మృతిపై ప్రతిపక్ష నేత ఎడప్పాడి కె. పళనిస్వామి రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. హైకోర్టు న్యాయమూర్తుల చే న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

“తమిళనాడులో మరో లాకప్ డెత్ జరిగింది. డిఎంకె ప్రభుత్వ హయాంలో లాకప్ డెత్ లు కొనసాగుతూనే ఉన్నాయి. లాకప్ డెత్ లను అరికట్టడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. డిఎంకె ప్రభుత్వ హయాంలో జరిగిన లాకప్ డెత్ ల‌పై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని మేము హైకోర్టు న్యాయమూర్తులను కోరుతున్నాము.” అని పళనిస్వామి అన్నారు.

కాగా ఈ ఏడాది ఏప్రిల్ లో డ్రగ్స్ కలిగి ఉన్నారనే ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేసిన విఘ్నేష్ అనే 25 ఏళ్ల యువకుడు పోలీసు లాకప్ లో మరుసటి రోజు చనిపోయాడు.

First Published:  13 Jun 2022 5:36 AM GMT
Next Story