Telugu Global
National

2 వేల నోటులో GPS ఉంటుందా ? అమితాబ్ బచ్చన్ ఏమంటున్నారు ?

2వేల నోటులో GPS ఉంటుందా లేదా ? ఇప్పటికీ ఈ విషయంలో కొందరికి అయోమయమే ఉంటుంది. ఇప్పటికీ చాలా మంది 2 వేల నోటు లో GPS ఉంటుందనే నమ్ముతున్నారు. ఇదే విషయం పై ప్రముఖ బాలి వుడ్ నటుడు నిర్వహించే ప్రఖ్యాత షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ లో ఆసక్తికరమైన‌ ప్రశ్న, ఆసక్తికరమైన‌ జవాబు తోపాటు అమితాబ్ బచ్చన్ మరింత ఆసక్తికర విశ్లేషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోటీలో పాల్గొన్న ఓ […]

amitab
X

2వేల నోటులో GPS ఉంటుందా లేదా ? ఇప్పటికీ ఈ విషయంలో కొందరికి అయోమయమే ఉంటుంది. ఇప్పటికీ చాలా మంది 2 వేల నోటు లో GPS ఉంటుందనే నమ్ముతున్నారు. ఇదే విషయం పై ప్రముఖ బాలి వుడ్ నటుడు నిర్వహించే ప్రఖ్యాత షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ లో ఆసక్తికరమైన‌ ప్రశ్న, ఆసక్తికరమైన‌ జవాబు తోపాటు అమితాబ్ బచ్చన్ మరింత ఆసక్తికర విశ్లేషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

పోటీలో పాల్గొన్న ఓ మహిళను అమితాబ్ ఓ ప్రశ్న అడుగుతారు. శాటిలైట్, టెలివిజన్, టైప్ రైటర్, 2 వేల నోటు వీటిలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్( GPS) ఎందులో ఉంటుందని అడుగుతారు. ఆమె వెంటనే 2 వేల నోటు అని చెపుతారు. అయితే ఆ సమాధానం తప్పని అమితాబ్ అనగానే ఆమె ఆశ్చర్యపోతారు. మీరు జోక్ చేస్తున్నారా అని అమితాబ్ ను అడుగాతారా మహిళ. ఎందుకంటే 2 వేల నోట్ లో GPS ఉంటుందని అంత‌గా నమ్ముతుందా మహిళ. ఈ సమాచారాన్ని తాను మీడియాలో చూశానని చెబుతుందా మహిళ. దీనిపై అమితాబ్, అది ఫేక్ న్యూస్ మనం ఒక వార్తను నమ్మే ముందు అది నిజమా కాదా అని తెలుసుకోవాలి. ఇలా ఫేక్ న్యూస్ కు బలికాకూడదు అని చెబుతారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిన‌ మీడియా తప్పు చేసిందని అమితాబ్ అంటారు.

నకిలీ వార్తలపై నమ్మకం ఉంచడం వల్ల జరిగేది ఇలా ఓటమి పాలవడమే . 2016లో దేశంలో 2 వేల నోటును ప్రవేశపెట్టినప్పుడు అందులో నానోటెక్నాలజీ, GPS చిప్స్ ఉన్నాయని ఫేక్ వార్తలు వచ్చాయి.

First Published:  13 Jun 2022 12:41 AM GMT
Next Story