Telugu Global
MOVIE UPDATES

ఏనుగు.. ఇదో కొత్త రకం యాక్షన్ సినిమా

యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి, మరో సినిమా సిద్ధం చేశాడు. తెలుగులో ఈ సినిమాకు ఏనుగు అనే టైటిల్ పెట్టారు. శ్రీ విఘ్నేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సతీష్ కుమార్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తమి్ లో నిర్మించిన “యానై” సినిమాను తెలుగులో “ఏనుగు” పేరుతో విడుదల చేస్తున్నారు సతీష్. హీరో సూర్య తో సింగం సిరీస్ , విశాల్ తో పూజ వంటి యాక్షన్ సినిమాలతో […]

ENUGU 2
X

యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి, మరో సినిమా సిద్ధం చేశాడు. తెలుగులో ఈ సినిమాకు ఏనుగు అనే టైటిల్ పెట్టారు. శ్రీ విఘ్నేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సతీష్ కుమార్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.

భారీ బడ్జెట్ తో తమి్ లో నిర్మించిన “యానై” సినిమాను తెలుగులో “ఏనుగు” పేరుతో విడుదల చేస్తున్నారు సతీష్. హీరో సూర్య తో సింగం సిరీస్ , విశాల్ తో పూజ వంటి యాక్షన్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు హరి, ఈ సినిమా దర్శకత్వం వహించడం విశేషం.

ఈ చిత్రంలో అరుణ్ విజయ్ హీరోగా నటించాడు. ఇదొక రూరల్ యాక్షన్ మూవీ. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. సముద్రఖని, కేజీఎఫ్ రామచంద్రరాజు, రాధిక శరత్‌కుమార్, యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

సినిమాకు సంబంధించి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 17న ఏనుగు సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఏనుగు అనే టైటిల్ ఎందుకు పెట్టారో సినిమా చూసి తెలుసుకోవాలంటున్నాడు నిర్మాత సతీశ్.

First Published:  12 Jun 2022 12:11 AM GMT
Next Story