Telugu Global
NEWS

టీడీపీకి కేశినేని దూరమవుతున్నారా?

బెజవాడ రాజకీయం రంజుగా మారుతుందా..? టీడీపీలో కుమ్ములాటలు ఇక పొలిటికల్ స్క్రీన్‌పైకి రాబోతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు. టీడీపీలో కేశినేని సునామీ రాబోతుంది అని ప్రచారం జరుగుతోంది. కేశినేని నాని, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య బాగా గ్యాప్‌ పెరిగిందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల మహానాడుకు కూడా కేశినేని హాజరుకాలేదు. టీడీపీ బాదుడే బాదుడుకు కూడా దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరు కావడం లేదు. ఇదే టైమ్‌లో ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమంలో కేశినేని […]

Kesineni-nani-mp-tdp-distence
X

బెజవాడ రాజకీయం రంజుగా మారుతుందా..? టీడీపీలో కుమ్ములాటలు ఇక పొలిటికల్ స్క్రీన్‌పైకి రాబోతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి రాజకీయవర్గాలు. టీడీపీలో కేశినేని సునామీ రాబోతుంది అని ప్రచారం జరుగుతోంది.

కేశినేని నాని, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య బాగా గ్యాప్‌ పెరిగిందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల మహానాడుకు కూడా కేశినేని హాజరుకాలేదు. టీడీపీ బాదుడే బాదుడుకు కూడా దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరు కావడం లేదు. ఇదే టైమ్‌లో ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమంలో కేశినేని చిన్ని పేరుతో బ్యానర్లు వెలిశాయి. ఆటోనగర్‌లో శతజయంతి ఉత్సవాల్లో అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కేశినేని సోదరుడు పేరిట పోస్టర్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. కేశినేని నాని లేకుండా కేశినేని శివనాథ్‌ పేరుతో వెలిసిన ఈపోస్టర్లు రాజకీయవర్గాల్లో చర్చగా మారాయి.

దేవినేని ఉమా గ్రూప్‌, కేశినేని నానికి మధ్య గ్రూప్‌ వార్‌ నడుస్తోంది. మేయర్‌ ఎన్నికల టైమ్‌లో కేశినేని నాని కూతురు శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించకుండా అడ్డుకోవాలని దేవినేని చాలా ప్రయత్నాలు చేశారు. ఎన్నికల టైమ్‌లో కూడా ఎవరికి వారే వ్యవహరించారు. ఆ తర్వాత దేవినేని ఉమా అరెస్టు అయితే కేశినేని నాని వెళ్లి పరామర్శించారు. కానీ ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ ఎక్కడ వెళ్లి కలిసింది లేదు.

తాజాగా ఇప్పుడు కేశినేని చిన్ని తెరపైకి రావడంతో.. బాబు, నాని మధ్య గ్యాప్‌ పెరిగిందని ప్రచారం జరుగుతోంది. బాబు కూడా కేశినేని నానిని బుజ్జగించడం లేదని తెలుస్తోంది. ఎప్పడూ లేని విధంగా నాని ఫొటోలు లేకుండా చిన్ని పేరుతో ఫ్లెక్సీలు వేయడంతో బెజవాడ టీడీపీలో ఏదో జరుగుతుంది అనే గుసగుస మాత్రం బయల్దేరింది.

First Published:  11 Jun 2022 9:45 PM GMT
Next Story