Telugu Global
MOVIE UPDATES

రూల్స్ కాదు.. నిజాయితీ కావాలి

కొన్ని విషయాల్లో ట్రెండ్ ను ఫాలో అవ్వకూడదు. సీనియర్ల సలహాలు తీసుకోవాలి. అలాంటి సీనియర్ సుధాకర్ రెడ్డి. నైజాంలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా ఎంతో అనుభవం ఉన్న ఈ వ్యక్తి సినిమా టికెట్ రేట్లు, ఓటీటీ రిలీజ్ పై తన అభిప్రాయాల్ని వెల్లడించారు. నిజంగా ఇండస్ట్రీకి ఇవి సరిగ్గా సరిపోతాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత మీడియాతో మాట్లాడిన సుధాకర్ రెడ్డి, తన అనుభవంతో చెబుతున్న కొన్ని ముఖ్య విషయాల్ని ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ చూద్దాం.. […]

నిజాయితీ కావాలి
X

కొన్ని విషయాల్లో ట్రెండ్ ను ఫాలో అవ్వకూడదు. సీనియర్ల సలహాలు తీసుకోవాలి. అలాంటి సీనియర్ సుధాకర్ రెడ్డి. నైజాంలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా ఎంతో అనుభవం ఉన్న ఈ వ్యక్తి సినిమా టికెట్ రేట్లు, ఓటీటీ రిలీజ్ పై తన అభిప్రాయాల్ని వెల్లడించారు. నిజంగా ఇండస్ట్రీకి ఇవి సరిగ్గా సరిపోతాయి. దాదాపు 15 ఏళ్ల తర్వాత మీడియాతో మాట్లాడిన సుధాకర్ రెడ్డి, తన అనుభవంతో చెబుతున్న కొన్ని ముఖ్య విషయాల్ని ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ చూద్దాం..

– చిన్న సినిమాలు 5వారాలు, పెద్ద సినిమాలు 50రోజులు అని రూల్ పెట్టుకున్నారు. కానీ సినిమా ఆడ‌క‌పోతే వెంట‌నే ఓటీటీలో వ‌చ్చేలా పంపిణీదారుల‌తో మాట్లాడుకుని ఓటీటీలో మంచి ఆఫ‌ర్ వ‌స్తుంద‌ని వారికే ఇచ్చేస్తున్నారు. నిర్మాత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేదు. ఎన్ని అగ్రిమెంట్లు ఉన్నా బిజినెస్ లెక్క‌ల బ‌ట్టి ఎవ‌రు ఎక్కువ రేటు ఇస్తే వారికే ఇచ్చేస్తుంటున్నారు. అలాకాకుండా పెద్ద సినిమాకు మినిమం 50రోజులు అని పెట్టుకుంటే ప‌రిశ్ర‌మ‌కు చాలా మంచిది.

– చిన్న, పెద్ద సినిమా ఏదైనా.. విడుదలైన 5 వారాల వరకూ ఓటీటీలోకి రాకూడదనే విధానం వుంది. సినిమా సరిగ్గా ఆడకపోతే ఓటీటీ వాళ్ళు మరో కోటి ఎక్కువ ఆఫర్ చేస్తే విడుదలకు ఇచ్చేస్తున్నారు. అడిగితే కోటి ఎక్కువ వస్తుంది కదా అంటున్నారు. ఈ విషయంలో ఐక్యత లేదు. దీని ప్రభావం ఇండస్ట్రీపై పడుతుంది.

– థియేటర్ కి ఎప్పుడూ వైభవం ఉంటుంది. రేట్లు మాత్రం ఎక్కువగా పెంచకూడదు. దీనికి నేను మొదటి నుండి వ్యతిరేకం. బడ్జెట్ పెరిగిందని టికెట్ రేటు పెంచడం తప్పు కదా. ఎంత పెంచాలో అంతే పెంచాలి. సినిమా మూడు వారాల్లో ఓటీటీకి వచ్చేస్తుంది. ఇంట్లోనే చూసుకునే అవకాశం వున్నప్పుడు అంత డబ్బు ఎందుకు పెట్టాలి?

– ప్రభుత్వం దగ్గరికి వెళ్లి టికెట్ రేట్లు అడిగాం. 200 నుండి 350 పెట్టుకోమన్నారు. అలాగని 350 పెట్టకూడదు కదా. సినిమాని బట్టి పెట్టుకోవాలి. మేము మల్టీఫ్లెక్స్ లో 200 మాత్రమే పెట్టాం. అందుబాటు రేటు పెట్టాం కాబట్టి డబ్బు వచ్చింది. బాహుబలి 2 నైజాంలో సాధారణ ధరలకే 55 కోట్లు కలెక్ట్ చేసింది. మరి ఇప్పుడు రేట్లు ఎందుకు పెంచుతున్నారు? టికెట్ అందరికీ అందుబాటులో ఉంటే రిపీట్ లో చూస్తారు, ఫ్యామిలీతో వస్తారు. ఇద్దరు సినిమాకి వెళ్ళాలంటే 1000 రూపాయిలైతే ఎలా? ఈ అసమతుల్యత ఉండకూడదు.

First Published:  12 Jun 2022 2:13 AM GMT
Next Story