Telugu Global
MOVIE UPDATES

గీతా ఆర్ట్స్ 2 నుంచి ఇకపై వరుసపెట్టి సినిమాలు

ఉన్నట్టుండి సడెన్ గా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నుంచి సినిమాలు తగ్గిపోయాయి. పైప్ లైన్లో చాలా సినిమాలున్నప్పటికీ ఏ మూవీకి రిలీజ్ డేట్ ప్రకటించలేదు. దీంతో గ్యాప్ వచ్చేసింది. ఇకపై అలాంటి గ్యాప్ ఉండదంటున్నాడు నిర్మాత బన్నీ వాస్. ఇకపై తన బ్యానర్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తాయని చెబుతున్నాడు. “కరోనా వల్ల 3 సంవత్సరాల నుంచి చాలా సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. అవన్నీ ఇప్పుడు వరసగా వచ్చేసాయి. దాంతో చిన్న, […]

bunny-vas
X

ఉన్నట్టుండి సడెన్ గా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నుంచి సినిమాలు తగ్గిపోయాయి. పైప్ లైన్లో చాలా సినిమాలున్నప్పటికీ ఏ మూవీకి రిలీజ్ డేట్ ప్రకటించలేదు. దీంతో గ్యాప్ వచ్చేసింది. ఇకపై అలాంటి గ్యాప్ ఉండదంటున్నాడు నిర్మాత బన్నీ వాస్. ఇకపై తన బ్యానర్ నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తాయని చెబుతున్నాడు.

“కరోనా వల్ల 3 సంవత్సరాల నుంచి చాలా సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. అవన్నీ ఇప్పుడు వరసగా వచ్చేసాయి. దాంతో చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలకు టైం దొరకలేదు. ఈ మధ్య అవి కూడా వరుసగా వస్తుండడంతో.. ఇక సినిమాలు గ్యాప్ లేకుండా రిలీజ్ చేస్తాను. జులై 1న పక్కా కమర్షియల్ సినిమా వస్తుంది. సెప్టెంబర్ 10న నిఖిల్ హీరోగా వస్తున్న 18 పేజెస్ విడుదల చేస్తాం. దసరా సీజన్ లో సెప్టెంబర్ 30న కిరణ్ అబ్బవరంతో చేస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ విడుదల చేస్తాను. అలాగే ఆగస్టులో అల్లు శిరీష్ సినిమా ఉంది. అది కూడా విడుదల చేస్తాను. కంటిన్యూగా ఈ మూడు నాలుగు నెలలు గీతా ఆర్ట్స్ 2 నుంచి సినిమాలు వస్తూనే ఉంటాయి.”

ఇలా తన సినిమాలపై పూర్తి అప్ డేట్ ఇచ్చాడు బన్నీ వాస్. మరోవైపు ఓటీటీ రిలీజ్ పై కూడా స్పందించాడు. తన సినిమాలేవీ విడుదలైన వారానికే ఓటీటీలోకి రావని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటివరకు తన సినిమాలేవీ 35 రోజులకు ముందే ఓటీటీకి ఇవ్వలేదని, ఇకపై ఆ లాక్-ఇన్ పీరియడ్ ను మరింత పెంచుతానని కూడా స్పష్టం చేశాడు.

First Published:  11 Jun 2022 10:13 PM GMT
Next Story