Telugu Global
NEWS

బ్లడీ ఫూల్స్ అందరికీ బాక్స్ లు బద్దలవుతాయి – మంత్రి రోజా

జగన్ ని వ్యతిరేకించేవారంతా బ్లడీ ఫూల్స్ అంటూ ఫైరయ్యారు మంత్రి రోజా. వారందరి బాక్సులు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బద్దలైపోతాయని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి వారందరికీ పెద్ద గుణపాఠం చెబుతామని అన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రమైనా, విభజిత ఏపీ అయినా.. ఇప్పటి వరకూ తెలుగు వాళ్లని పాలించిన 15మంది ముఖ్యమంత్రుల చరిత్రల్ని తిరగరాస్తున్నది జగన్ ఒక్కరేనని అన్నారు రోజా. ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారంకోసం మండలానికి ఓ మంత్రిని ఇన్ చార్జిగా నియమించారు. కొంతమంది […]

roja
X

జగన్ ని వ్యతిరేకించేవారంతా బ్లడీ ఫూల్స్ అంటూ ఫైరయ్యారు మంత్రి రోజా. వారందరి బాక్సులు ఆత్మకూరు ఉప ఎన్నికల్లో బద్దలైపోతాయని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి వారందరికీ పెద్ద గుణపాఠం చెబుతామని అన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రమైనా, విభజిత ఏపీ అయినా.. ఇప్పటి వరకూ తెలుగు వాళ్లని పాలించిన 15మంది ముఖ్యమంత్రుల చరిత్రల్ని తిరగరాస్తున్నది జగన్ ఒక్కరేనని అన్నారు రోజా.

ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రచారంకోసం మండలానికి ఓ మంత్రిని ఇన్ చార్జిగా నియమించారు. కొంతమంది మంత్రులు ప్రచారానికి వచ్చి వెళ్తున్నా.. రోజా మాత్రం తనకు కేటాయించిన మండలంలోనే మకాం వేశారు. చేజర్ల మండలంలో ఆమె సుడిగాలి పర్యటన చేస్తున్నారు. వైసీపీ నాయకుల ఇంటిలో బస చేసిన ఆమె.. ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు రోజా. 1.4 లక్షల కోట్ల రూపాయలతో ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. ఆర్బీకేల ద్వారా రైతులకు మేలు జరుగుతోందని, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ కు దీటుగా తీర్చిదిద్దామ‌ని అన్నారామె.

టీడీపీ హయాంలో ఇలా జరిగిందా..?

టీడీపీ హయాంలో కేవలం ఆ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకే పింఛన్లు ఇచ్చారని, జగన్ హయాంలో అర్హులందరికీ అన్ని పథకాలు అందుతున్నాయని చెప్పారు. ప్రతి నెలా 1వతేదీ ఉదయాన్నే వాలంటీర్ ఇంటికి వచ్చి మరీ పింఛన్ ఇచ్చి వెళ్తున్నారని, దేశంలో ఎక్కడైనా ఇలా జరుగుతోందా అని ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు రోజా.

First Published:  11 Jun 2022 8:22 PM GMT
Next Story