Telugu Global
MOVIE UPDATES

పేరుకే హీరోహీరోయిన్లు.. కానీ కలిసి నటించలేదు

త్వరలోనే థియేటర్లలోకి రానుంది గాడ్సే సినిమా. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమాతో ఐశ్వర్య లక్ష్మీమీనన్ హీరోయిన్ గా పరిచయమౌతోంది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు హీరో సత్యదేవ్. ఈ సినిమాలో హీరోహీరోయిన్లు అస్సలు కలుసుకోరట. “ఈ సినిమాతో ఐశ్వ‌ర్య ల‌క్ష్మీమీన‌న్ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. సినిమాలో మేం ఇద్ద‌రం క‌లిసి న‌టించ‌లేదు. సినిమాలో ఇద్ద‌రం డిజిట‌ల్ మీడియంతోనే మాట్లాడుకుంటాం. త‌ను అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. మేమిద్దరం ఇలా ప్రమోషన్ లోనే ఎక్కువగా కలిశాం.” […]

satyadev
X

త్వరలోనే థియేటర్లలోకి రానుంది గాడ్సే సినిమా. సత్యదేవ్ హీరోగా నటించిన ఈ సినిమాతో ఐశ్వర్య లక్ష్మీమీనన్ హీరోయిన్ గా పరిచయమౌతోంది. ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు హీరో సత్యదేవ్. ఈ సినిమాలో హీరోహీరోయిన్లు అస్సలు కలుసుకోరట.

“ఈ సినిమాతో ఐశ్వ‌ర్య ల‌క్ష్మీమీన‌న్ తెలుగులో ఎంట్రీ ఇస్తోంది. సినిమాలో మేం ఇద్ద‌రం క‌లిసి న‌టించ‌లేదు. సినిమాలో ఇద్ద‌రం డిజిట‌ల్ మీడియంతోనే మాట్లాడుకుంటాం. త‌ను అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. మేమిద్దరం ఇలా ప్రమోషన్ లోనే ఎక్కువగా కలిశాం.”

ఇలా అసలు విషయాన్ని బయటపెట్టాడు సత్యదేవ్. తనను అంతా యూత్ ఫిలిం చేయమని అడుగుతున్నారని.. గాడ్సే అనేది యూత్ ఫిలిం అంటున్నాడు సత్యదేవ్. ఇది లవ్ స్టోరీ కాదని, యూత్ స్టోరీ అని చెబుతున్నాడు.

ఈ సినిమా ప్రీ-క్లైమాక్స్ కోసం సత్యదేవ్ ఓ ప్రయోగం చేశాడు. 3 నిమిషాల 26 సెకన్లుండే ప్రీ క్లైమాక్స్ సీన్‌ను స‌త్య సింగిల్ టేక్‌లో పూర్తిచేశాడు. సినిమాకు ఇది హైలెట్ అవుతుందని యూనిట్ గట్టిగా చెబుతోంది.

First Published:  12 Jun 2022 3:14 AM GMT
Next Story