Telugu Global
MOVIE UPDATES

జిన్నాగా మారిన గాలి నాగేశ్వరరావు

విష్ణు మంచు హీరోగా నటిస్తున్న తాజా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇది విష్ణు కి 19వ సినిమా. ఈ సినిమాలో ‘గాలి నాగేశ్వరరావు‘ అనే మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు విష్ణు. ఈ క్యారెక్టర్ రివీల్ చేసినప్పట్నుంచి సినిమాపై అంచనాలు పెరిగాయి. పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ వంటి తారలు యాడ్ అవ్వడం సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. దీంతో ఈ సినిమాకు గాలి నాగేశ్వరరావు అనే టైటిల్ నే ఉంచుతారని అంతా అనుకున్నారు. […]

ginna
X

విష్ణు మంచు హీరోగా నటిస్తున్న తాజా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇది విష్ణు కి 19వ సినిమా. ఈ సినిమాలో ‘గాలి నాగేశ్వరరావు‘ అనే మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు విష్ణు. ఈ క్యారెక్టర్ రివీల్ చేసినప్పట్నుంచి సినిమాపై అంచనాలు పెరిగాయి. పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ వంటి తారలు యాడ్ అవ్వడం సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

దీంతో ఈ సినిమాకు గాలి నాగేశ్వరరావు అనే టైటిల్ నే ఉంచుతారని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా మరో టైటిల్ ప్రకటించింది యూనిట్. గాలి నాగేశ్వరరావు సినిమాకు జిన్నా అనే టైటిల్ పెట్టారు.

ఈ సినిమా ప్రమోషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న విష్ణు మంచు సినిమా టైటిల్ ని కూడా వెరైటీ గా రివీల్ చేశాడు. సునీల్, కోన వెంకట్, ఛోటా.కె.నాయుడు, అనూప్ రూబెన్స్, ఇషాన్ సూర్య తో కలిసి సరదాగా చిట్ చాట్ చేస్తూ, ఫైనల్ గా ‘జిన్నా’ అనే టైటిల్ ని అనౌన్స్ చేసి వీడియోని విడుదల చేశాడు. అలా గాలి నాగేశ్వరరావు కాస్తా జిన్నాగా మారాడు.

ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కథ, స్ర్కీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు.

First Published:  11 Jun 2022 11:15 PM GMT
Next Story