Telugu Global
NEWS

ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష తీసుకున్న ‘విషం’ ! క్షణాల్లో ప్రాణం తీసే ‘కర్బనం’ !

ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష హైదరాబాద్ లోని తన ఇంట్లో ప్రాణాంతకమైన కార్బన్ మోనాక్సయిడ్ తీసుకుని సూసైడ్ చేసుకున్నారు. అసలేమిటీ విషతుల్య పదార్థం..? ఆమెకు ఇది ఎక్కడినుంచి, ఎలా లభించింది..? ఎవరు దీన్ని ఆమెకు సప్లయ్ చేశారు..? ఇవన్నీ పోలీసుల దర్యాప్తులో తేలవలసిన విషయాలు.. ఇక కార్బన్ మోనాక్సయిడ్. ఇది దాదాపు సైనైడ్ లాంటిదే ! రంగు, రుచి, వాసన లేని వివిధ రకాల ఇంధనాల సమ్మిళితమే. ఈ గ్యాస్ పీలిస్తే తక్షణమే శరీరంలోని అన్ని భాగాలకు వ్యాపించి […]

ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష తీసుకున్న ‘విషం’ ! క్షణాల్లో ప్రాణం తీసే ‘కర్బనం’ !
X

ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష హైదరాబాద్ లోని తన ఇంట్లో ప్రాణాంతకమైన కార్బన్ మోనాక్సయిడ్ తీసుకుని సూసైడ్ చేసుకున్నారు. అసలేమిటీ విషతుల్య పదార్థం..? ఆమెకు ఇది ఎక్కడినుంచి, ఎలా లభించింది..? ఎవరు దీన్ని ఆమెకు సప్లయ్ చేశారు..? ఇవన్నీ పోలీసుల దర్యాప్తులో తేలవలసిన విషయాలు.. ఇక కార్బన్ మోనాక్సయిడ్. ఇది దాదాపు సైనైడ్ లాంటిదే ! రంగు, రుచి, వాసన లేని వివిధ రకాల ఇంధనాల సమ్మిళితమే. ఈ గ్యాస్ పీలిస్తే తక్షణమే శరీరంలోని అన్ని భాగాలకు వ్యాపించి విషతుల్యం చేస్తుంది. క్రమంగా ప్రాణవాయువు ..ఆక్సిజన్ అందడం ఆగిపోతుంది. దీని ప్రభావంతో మొదట కళ్ళు తిరగడం, తలనొప్పి, తీవ్రమైన అలసట..ఛాతీ, కడుపునొప్పి, మెల్లగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆ తరువాత ఊపిరి ఆగిపోవడం.. చివరకు మరణమే సంభవిస్తుంది. కుంపట్లో నిప్పులు వేసుకునిగానీ, చిమ్నీలో నిప్పు కణికలపై లేదా హీటర్లపై గానీ ఈ గ్యాస్ వదిలిన వెంటనే ‘మృత్యు’ పొగలు ఆవరిస్తాయి. గాల్లో కార్బన్ మోనాక్సయిడ్ శాతం ఎక్కువగా ఉన్న పక్షంలో దీని ప్రభావం కూడా హెచ్చుగా ఉంటుంది. ఇది ఎంత విషతుల్యమంటే.. ఒక్కోసారి కేవలం 5 నిముషాల్లో ప్రాణాలు గాల్లో కలుస్తాయి.

మరికొన్ని సందర్భాల్లో ఒకటి రెండు గంటల్లో శరీరమంతా నల్లగా కమిలిపోయి ప్రాణాలు గాల్లో కలుస్తాయి. రక్త కణాలను, నాడుల మీద కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అంటే వీటితో సహా గుండెకు సరఫరా అయ్యే ఆక్సిజన్ అందకుండా పోతుంది. డిప్రెషన్ లేదా ఎనిమియా వంటి రుగ్మతలతో బాధపడుతున్నవారిపై కార్బన్ మోనాక్సయిడ్ మరింత త్వరగా తీవ్ర ప్రభావం చూపుతుందన్నది నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా తలుపులన్నీ మూసుకుని దీన్ని పీల్చిన పక్షంలో ఇక క్షణాల్లో మృత్యుముఖం చేరినట్టే ! అసలు కార్బన్.. కర్బనం అంటేనే పాయిజన్.. థర్మల్ కంబశ్చన్ దీని సోర్స్ అంటున్నారు. ఈ గ్యాస్ కారణంగా శరీరంలో కార్బాక్సీ హెమోగ్లోబిన్ ఏర్పడుతుందని, అప్పుడు రక్తం ఆక్సిజన్ ని సరఫరా చేయజాలదని, ఫలితంగా కణజాలం కూడా నిర్వీర్యమైపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గ్యాస్, ఆయిల్, బొగ్గు, కలప వంటివి పూర్తిగా కాలకపోతే కార్బన్ మోనాక్సయిడ్ ఏర్పడుతుందన్నది ఓ అభిప్రాయం. అయితే మీథనాల్ ఉత్పత్తిలోను, చేపలు, బీఫ్ వంటి తాజా మాంసాహార ఉత్పత్తుల ప్యాకేజీలోనూ దీన్ని వాడుతారని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇన్-ఫ్రా రెడ్ లేజర్లలో, జామ్, కోలా వంటివాటిని ఎసిడిఫై చేయడంలో, బెవేరేజెస్ లో, డిటర్జెంట్ల తయారీలో కూడా ఈ గ్యాస్ ని పరిమిత స్థాయిలో వాడుతారు. ఏమైనా.. ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష ఈ హానికరమైన విషాన్ని తీసుకుని ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరం. ఒక విధంగా ఆమె సైనైడ్ సేవించినట్టే !

First Published:  12 Jun 2022 6:09 AM GMT
Next Story