Telugu Global
NEWS

స్కూల్ సెలవుల‌పై విద్యాశాఖ మంత్రి క్లారిటీ

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి, తెలంగాణలో కూడా రోజువారీ కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో స్కూల్ సెలవులపై ప్రభుత్వం పునరాలోచిస్తోందని, కరోనా కేసులు పెరుగుతుండటంతో సెలవులు కూడా పొడిగిస్తారని అనుకున్నారంతా. మధ్యాహ్నం వరకు దీనిపై పుకార్లు షికార్లు చేశాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కూడా కాస్త ఆందోళన పడ్డాయి. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రేపటినుంచి స్కూల్స్ యధావిధిగా ప్రారంభమవుతాయని చెప్పారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కరోనా […]

స్కూల్ సెలవుల‌పై విద్యాశాఖ మంత్రి క్లారిటీ
X

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి, తెలంగాణలో కూడా రోజువారీ కేసుల్లో పెరుగుదల నమోదవుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో స్కూల్ సెలవులపై ప్రభుత్వం పునరాలోచిస్తోందని, కరోనా కేసులు పెరుగుతుండటంతో సెలవులు కూడా పొడిగిస్తారని అనుకున్నారంతా.

మధ్యాహ్నం వరకు దీనిపై పుకార్లు షికార్లు చేశాయి. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కూడా కాస్త ఆందోళన పడ్డాయి. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రేపటినుంచి స్కూల్స్ యధావిధిగా ప్రారంభమవుతాయని చెప్పారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

కరోనా భయాలున్నా ముందుకే..
పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని పాఠశాలల నిర్వాహకులను ఆదేశించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మన ఊరు – మన బడిలో భాగంగా 9వేల పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, స్కూల్స్ ప్రారంభించినా, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా.. నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారామె.

ఈ ఏడాది నుంచే ఇంగ్లిష్ మీడియం..
ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన చేపట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. లక్షా 4వేలమంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు అజీమ్‌ ప్రేమ్‌ జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు.

ఇంగ్లిష్ మీడియం బోధన నేపథ్యంలో పిల్లలకు ఇబ్బందులు లేకుండా.. నెల రోజుల పాటు బ్రిడ్జి కోర్సు నిర్వహించబోతున్నారు. ఒకేసారి ఇంగ్లిష్ మీడియంలోకి మారితే విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశముండటంతో.. ఈ ఏడాదికి తెలుగు, ఇంగ్లిష్‌ మీడియంలలో బుక్స్‌ ప్రింట్ చేస్తున్నారు.

తల్లిదండ్రులు కూడా ఈ ఏడాది ఇంగ్లిష్ మీడియం విషయంలో కాస్త శ్రద్ధ వహించాలని సూచించారు మంత్రి. తల్లిదండ్రులంతా బడి ఈడు పిల్లలను పాఠశాలల్లో చేర్పించాలని కోరారు సబితా ఇంద్రారెడ్డి. బడిబాటలో భాగంగా గతవారం రోజుల్లో 70వేల మంది పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించామన్నారు. ఈ కార్యక్రమం మరో వారంరోజులు కొనసాగుతుందని చెప్పారు.

First Published:  12 Jun 2022 7:29 AM GMT
Next Story