Telugu Global
National

కేసీఆర్ కు మమత ఫోన్..ఢిల్లీ సమావేశానికి ఆహ్వానం

తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కే. చంద్రశేఖర్ రావుకు బెంగాల్ ముఖ్యమంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఫోన్ చేశారు. ఈ నెల 15న ఢిల్లీలో జరగబోయే సమావేశానికి ఆమె కేసీఆర్ ను ఆహ్వానించారు. ఢిల్లో ఆమె ప‌లు రాజ‌కీయ పార్టీల నేత‌లతో సమావేశం నిర్వహించనున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కూటములు ఏర్పాటుకు కేసీఆర్ తో సహా మమతా బెనర్జీ కూడా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకోసం కేసీఆర్ అయితే ఏకంగా పలు రాష్ట్రాలు […]

kcr, mamatha
X

తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కే. చంద్రశేఖర్ రావుకు బెంగాల్ ముఖ్యమంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఫోన్ చేశారు. ఈ నెల 15న ఢిల్లీలో జరగబోయే సమావేశానికి ఆమె కేసీఆర్ ను ఆహ్వానించారు. ఢిల్లో ఆమె ప‌లు రాజ‌కీయ పార్టీల నేత‌లతో సమావేశం నిర్వహించనున్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా కూటములు ఏర్పాటుకు కేసీఆర్ తో సహా మమతా బెనర్జీ కూడా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకోసం కేసీఆర్ అయితే ఏకంగా పలు రాష్ట్రాలు పర్యటించి పలు పార్టీల అధినాయకులతో సమావేశాలు కూడా నిర్వహించారు.

అదే దిశలో ప్రయత్నాలు చేస్తున్న మమతా బెనర్జీ వచ్చే నెలలో రాష్ట్రపతి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ నెల 15న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. అందుకోసం ఆమె సోనియా గాంధీ, దేశంలోని 8 రాష్ట్రాల బీజేపీయేతర ముఖ్యమంత్రుల‌తో సహా 22 మంది జాతీయ స్థాయి నేత‌ల‌కు ఆహ్వానాలు పంపారు. అందులో భాగంగానే కేసీఆర్ కు దీదీ ఫోన్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్రపతి ఎన్నికలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థికి పోటీగా ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టేందుకు మమతా బెనర్జీ ప్రయత్నాలు చేస్తోంది. అలాగే 2024 పార్లమెంటు ఎన్నికల్లో బీజెపి కూటమిని ఓడించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరగనుంది.

First Published:  11 Jun 2022 6:08 AM GMT
Next Story