Telugu Global
NEWS

ఆరోగ్య శ్రీపై కన్ను..మోడీ బొమ్మేదని కేంద్రమంత్రి నిలదీత

ఏపీలో ఆరోగ్య శ్రీ కార్డులపై ప్రధాని నరేంద్రమోడీ ఫోటో లేకపోవడంపై కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్ అభ్యంతరం తెలిపారు. విజయవాడలో పర్యటించిన ఆమె.. ప్రభుత్వ ఆస్పత్రికి సందర్శించారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బోర్డులపై వైఎస్‌ఆర్‌, జగన్‌ ఫోటోలు మాత్రమే ఉండడంతో ప్రధాని మోడీ ఫోటో ఎక్కడని ప్రశ్నించారు. ఆయూష్మాన్‌ భారత్‌కు సంబంధించిన లోగోను గోడపై ఏర్పాటు చేసినప్పటికీ దాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఆరోగ్య శ్రీ […]

ఆరోగ్య శ్రీపై కన్ను..మోడీ బొమ్మేదని కేంద్రమంత్రి నిలదీత
X

ఏపీలో ఆరోగ్య శ్రీ కార్డులపై ప్రధాని నరేంద్రమోడీ ఫోటో లేకపోవడంపై కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్ అభ్యంతరం తెలిపారు. విజయవాడలో పర్యటించిన ఆమె.. ప్రభుత్వ ఆస్పత్రికి సందర్శించారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన బోర్డులపై వైఎస్‌ఆర్‌, జగన్‌ ఫోటోలు మాత్రమే ఉండడంతో ప్రధాని మోడీ ఫోటో ఎక్కడని ప్రశ్నించారు.

ఆయూష్మాన్‌ భారత్‌కు సంబంధించిన లోగోను గోడపై ఏర్పాటు చేసినప్పటికీ దాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేశారని ఆమె అసహనం వ్యక్తం చేశారు.

ఆరోగ్య శ్రీ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నప్పుడు మోడీ బొమ్మ ఎందుకు ముద్రించరని అధికారులను కేంద్రమంత్రి ప్రశ్నించారు. పథకం అమలు తీరును రాష్ట్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ వివరించే ప్రయత్నం చేయగా కేంద్రమంత్రి అడ్డుపడ్డారు. అక్కడ లబ్దిదారుల చేతిలో ఉన్న ఆరోగ్య శ్రీ కార్డును చూపిస్తూ అందులో మోడీ ఫోటో ఎందుకు లేదని ప్రశ్నించారు. దాంతో కమిషనర్‌ మౌనంగా ఉండిపోయారు.

కేంద్ర మంత్రి అధికారులను నిలదీస్తున్న సమయంలో ఆమె పక్కనే విజయవాడ సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నప్పటికీ ఆయన జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండిపోయారు.

నిజానికి కేంద్ర ప్రభుత్వం ఆయూష్మాన్ భారత్ పేరుతో పథకాన్ని తెచ్చినా.. ఆరోగ్య శ్రీకి ఆ పథకం ఏమాత్రం సాటి రాదు. ఆరోగ్య శ్రీ కింద ఏటా ఏపి ప్రభుత్వం 2400 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. కేంద్రం ఆయూష్మాన్ కింద ఇస్తున్నది కేవలం 250 నుంచి 300 కోట్లు మాత్రమే.

అయినా సరే ఆరోగ్య శ్రీ పథకం తమదేనని ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. క్లెయిమ్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కేంద్ర మంత్రి కూడా ఆ తరహాలోనే ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. అసలు ఆరోగ్య శ్రీ పుట్టిందే వైఎస్ హయాంలో అన్న విషయం బీజేపీ నేతలకు తెలిసినట్టుగా లేదు.

First Published:  10 Jun 2022 8:56 PM GMT
Next Story