Telugu Global
NEWS

మతం గురించి కాదు, కరెంట్, నీళ్లు,ఉద్యోగాల గురించి ఆలోచించండి – కేటీఆర్

చిల్లర రాజకీయాల కోసం దేశప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని తెలంగాణ ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ మండి పడ్డారు. కులం, మ‌తం పేరిటి రాజ‌కీయాలు చేస్తూ, ప‌చ్చ‌గా ఉన్న దేశంలో చిచ్చుపెట్టి, ఆ చిచ్చులో చ‌లి మంట‌ల‌ను కాచుకోని, నాలుగు ఓట్లు దండుకోవాల‌ని చూస్తున్నార‌ని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవ్వాళ్ళ కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన‌ సందర్భంగా పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. 11.75 కోట్ల రూపాయలతో ల‌కారం చెరువుపై నిర్మించిన కేబుల్ […]

ktr
X

చిల్లర రాజకీయాల కోసం దేశప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని తెలంగాణ ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ మండి పడ్డారు. కులం, మ‌తం పేరిటి రాజ‌కీయాలు చేస్తూ, ప‌చ్చ‌గా ఉన్న దేశంలో చిచ్చుపెట్టి, ఆ చిచ్చులో చ‌లి మంట‌ల‌ను కాచుకోని, నాలుగు ఓట్లు దండుకోవాల‌ని చూస్తున్నార‌ని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవ్వాళ్ళ కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన‌ సందర్భంగా పలు అభివృద్ది పనులను ప్రారంభించారు.

11.75 కోట్ల రూపాయలతో ల‌కారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెనను రోడ్డు రవాణా శాల్హా మంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ర‌ఘునాథపాలెంలో 2 కోట్ల రూపాయల‌తో నిర్మించిన ప్ర‌కృతి వ‌నాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు.

దేశంలో విపరీత దోరణులు పెరిగిపోయాయని, క‌రెంట్, నీళ్లు లేని గ్రామాల గురించి , పిల్ల‌ల ఉద్యోగాల గురించి కాకుండా మతం కులం గురించి ఆలోచిస్తే దేశం సర్వనాశ‌నం అవుతుందని ఆయన అన్నారు. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుందామనుకుంటున్న భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి పట్టిన శని ఆయన ఆరోపించారు.

1987లో భార‌త‌దేశం ఆర్థిక ప‌రిస్థితి, చైనా ఆర్థిక ప‌రిస్థితి ఒకే రకంగా ఉండేది. కానీ ఇవ్వాళ్ళ చైనా అభివృద్దిని చూడండి. చైనా 16 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌తో ముందుకు దూసుకుపోయింది. మ‌నం మాత్రం 3 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌తో వెనుక‌బ‌డిపోయాం. అని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. ఇతర మతాలతో పంచాయితీలు పెట్టుకోవాల‌ని ఏ దేవుడు కూడా చెప్ప‌లేదని కేటీఆర్ పేర్కొన్నారు.

First Published:  11 Jun 2022 3:09 AM GMT
Next Story