Telugu Global
National

రాజ్యసభ ఎన్నికల ఫలితాలివే

రాజ్యసభ ఎన్నికల్లో 41 స్థానాలు ఏకగ్రీవం కాగా 16 సీట్లకు నిన్న ఎన్నికలు జరిగాయి. కర్నాటకలో 4 సీట్ల‌కు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 3, కాంగ్రెస్ ఒక్క సీటును గెల్చుకుంది. బీజేపీ నుంచి కేంద్రమంత్రి నిర్మల సీతారామన్, లహర్ సింగ్ సిరోయా, జగ్గేష్ విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి జైరాం రమేష్ గెలిచారు. రాజస్థాన్ లో 4 సీట్లకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 3 సీట్లను గెల్చుకుంది. బీజేపీ ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీ అభ్యర్థి […]

రాజ్యసభ ఎన్నికల ఫలితాలివే
X

రాజ్యసభ ఎన్నికల్లో 41 స్థానాలు ఏకగ్రీవం కాగా 16 సీట్లకు నిన్న ఎన్నికలు జరిగాయి. కర్నాటకలో 4 సీట్ల‌కు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 3, కాంగ్రెస్ ఒక్క సీటును గెల్చుకుంది. బీజేపీ నుంచి కేంద్రమంత్రి నిర్మల సీతారామన్, లహర్ సింగ్ సిరోయా, జగ్గేష్ విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి జైరాం రమేష్ గెలిచారు. రాజస్థాన్ లో 4 సీట్లకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ 3 సీట్లను గెల్చుకుంది. బీజేపీ ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీ అభ్యర్థి ఘన్‌శ్యామ్ తివారీ,బీజేపీ బలపరిచిన జీ మీడియా చైర్మన్ సుభాష్ చంద్ర ఓటమిపాలయ్యారు.

మ‌హారాష్ట్రలో శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ఆరు స్థానాలకు గాను బీజేపీ మూడింటిని గెలుచుకుని అధికార కూటమికి షాకిచ్చింది. క్రాస్ ఓటింగ్‌పై వాగ్వివాదం, ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో కౌంటింగ్ దాదాపు ఎనిమిది గంటలు ఆలస్యమైంది. గెలుపొందిన బీజేపీ నేతల్లో కేంద్రమంత్రి పీయూష్ గోయల్, రాష్ట్ర మాజీ మంత్రి అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ ఉన్నారు. ఇక, మహారాష్ట్రలోని అధికార మహారాష్ట్ర వికాస్ అఘాడీ కూటమి అభ్యర్థుల్లో శివసేన నేత సంజయ్ రౌత్, ఎన్‌సీపీ అభ్యర్థి ప్రఫుల్ పటేల్, కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ప్రతాప్ గర్హి విజయం సాధించారు. తీవ్ర ఉత్కంఠ మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందని ఆరోపిస్తూ బీజేపీ, శివసేన రెండూ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాయి.

హ‌ర్యానాలో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ అభ్యర్థి అజయ్ మాకెన్ తగినంత ఓట్లు సాధించడంలో విఫలమై ఓటమి పాలయ్యారు. బీజేపీ నేత కృషన్‌లాల్ పన్వర్, బీజేపీ మద్దతుతో బరిలో దిగిన స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మ రాజ్యసభకు ఎన్నికయ్యారు.

ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్ లలో 41 సీట్లు ఏకగ్రీవం అయ్యాయి. అందులో దాదాపు అన్ని చోట్ల అధికార పార్టీలే ఆ సీట్లను గెల్చుకున్నాయి. తెలంగాణలో 2 సీట్లలో టీఆరెస్ అభ్యర్థులు దివకొండ దామోదర్ రావు, బండి పార్థసారధి రెడ్డి ఏకగ్రీవం కాగా ఏపీ నుంచి 4 స్థానాలకు వైసీపీ నుంచి బీద మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి, ఆర్‌.కృష్ణయ్య, విజయసాయిరెడ్డి గెలుపొందారు.

First Published:  10 Jun 2022 9:54 PM GMT
Next Story