Telugu Global
MOVIE UPDATES

చిన్న సినిమాకు పెద్ద ప్రచారంగా మారిన సిద్

సిద్ శ్రీరామ్.. టాలీవుడ్ లో స్టార్ గాయకుడు. ఇతడితో పాట పాడించడం స్టార్ హీరోలకు ఓ సెంటిమెంట్ గా మారింది. అటు చిన్న హీరోలకు సిద్ శ్రీరామ్ వాయిస్ ఓ అవసరంగా మారింది. ఎఁదుకంటే, సిద్ శ్రీరామ్ పాట పాడితే, అది కచ్చితంగా హిట్టవుతుంది. పాట హిట్టయితే ,సినిమాకు క్రేజ్ వస్తుంది. ఆది సాయికుమార్ విషయంలో ఇదే జరిగింది. అతడు నటించిన శశి, అతిథి దేవోభవ లాంటి సినిమాలకు సిద్ శ్రీరామ్ పాడిన పాటలతోనే క్రేజ్ వచ్చింది. […]

sid sriram
X

సిద్ శ్రీరామ్.. టాలీవుడ్ లో స్టార్ గాయకుడు. ఇతడితో పాట పాడించడం స్టార్ హీరోలకు ఓ సెంటిమెంట్ గా మారింది. అటు చిన్న హీరోలకు సిద్ శ్రీరామ్ వాయిస్ ఓ అవసరంగా మారింది. ఎఁదుకంటే, సిద్ శ్రీరామ్ పాట పాడితే, అది కచ్చితంగా హిట్టవుతుంది. పాట హిట్టయితే ,సినిమాకు క్రేజ్ వస్తుంది.

ఆది సాయికుమార్ విషయంలో ఇదే జరిగింది. అతడు నటించిన శశి, అతిథి దేవోభవ లాంటి సినిమాలకు సిద్ శ్రీరామ్ పాడిన పాటలతోనే క్రేజ్ వచ్చింది. అందుకే ఇప్పుడు సాయిరాం శంకర్ కూడా అదే రూటు ఫాలో అయ్యాడు. తన కొత్త సినిమా కోసం సిద్ శ్రీరామ్ తో పాట పాడించాడు.

సాయిరామ్ శంకర్, అశీమా నర్వాల్ జంటగా వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా “ఒక పథకం ప్రకారం”. ఈ చిత్రాన్ని జాతీయ అవార్డు విన్నింగ్ దర్శకుడు వినోద్ విజయన్ తెరకెక్కిస్తున్నాడు. ఈయనతో పాటు మరో ఐదుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ ఒక పథకం ప్రకారం సినిమా కోసం పని చేస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా వస్తుంది.

ఇందులో రామ రావణ తరహా పాత్రలో నటిస్తున్నారు సాయిరామ్ శంకర్. తాజాగా ఈ చిత్రంలోని ‘ఓసారిలిరా’ అనే లిరికల్ సాంగ్‌ను రామ్ పోతినేని విడుదల చేశాడు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాటకు అనూహ్యమైన స్పందన వస్తుంది. ఈ పాటకు రెహమాన్ లిరిక్స్ అందించాడు.
ఇప్పటికే రవితేజ చేతుల మీదుగా విడుదలైన టీజర్‌లో సినిమా కాన్సెప్టును చూపించారు మేకర్స్. ఇందులో కొత్తగా కనిపిస్తున్నాడు సాయిరామ్ శంకర్. పూర్తిగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గానే ఒక పథకం ప్రకారం సినిమా వస్తుంది. ఈ చిత్రం కోసం ఆరుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ వర్క్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన సిద్ శ్రీరామ్ పాటతో, ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరుగుతాయని మేకర్స్ భావిస్తున్నారు.

First Published:  11 Jun 2022 3:12 AM GMT
Next Story