Telugu Global
MOVIE UPDATES

నయనతారకు చిక్కులు తప్పవా?

ఇలా పెళ్లి చేసుకుందో లేదో అలా వివాదాలకు కేంద్ర బిందువైన నయనతార. పెళ్లి తర్వాత శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చిన నయనతార-విఘ్నేష్ దంపతులు, అక్కడ చేసిన పనులతో ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేవలం విమర్శలే అయితే నయనతార పట్టించుకోదు. అలాంటి విమర్శల్ని ఎన్నింటినో ఆమె ఫేస్ చేసింది. కానీ ఈసారి విమర్శలతో పాటు కేసులు కూడా తప్పేలా లేవు. తిరుమల మాడవీధుల్లో చెప్పులతో తిరిగింది నయనతార. ఇది చాలా పెద్ద అపచారం. అక్కడితో ఆగకుండా శ్రీవారి […]

Nayanthara tirumala
X

ఇలా పెళ్లి చేసుకుందో లేదో అలా వివాదాలకు కేంద్ర బిందువైన నయనతార. పెళ్లి తర్వాత శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చిన నయనతార-విఘ్నేష్ దంపతులు, అక్కడ చేసిన పనులతో ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. కేవలం విమర్శలే అయితే నయనతార పట్టించుకోదు. అలాంటి విమర్శల్ని ఎన్నింటినో ఆమె ఫేస్ చేసింది. కానీ ఈసారి విమర్శలతో పాటు కేసులు కూడా తప్పేలా లేవు.

తిరుమల మాడవీధుల్లో చెప్పులతో తిరిగింది నయనతార. ఇది చాలా పెద్ద అపచారం. అక్కడితో ఆగకుండా శ్రీవారి ఆలయం ముందు ఆమె ఫొటో షూట్ చేసింది. నయనతార-విఘ్నేష్ ఇద్దరూ కలిసి, ఫొటోషూట్ కు పోజులిచ్చారు. నయనతార పెళ్లి మొత్తాన్ని కవర్ చేస్తున్న ఓ పెద్ద సంస్థ.. ఈ ఫొటోషూట్ నిర్వహించింది.

దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రవం వ్యక్తం చేశారు. కొండపై ఫొటోషూట్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేస్తున్నాడు. దీనిపై టీటీడీ అధికారులు దృష్టి పెట్టారు.

తిరుమల మాడ వీధుల్లో చెప్పులతో తిరగడం తప్పే. దీనిపై క్షమాపణలు కోరుతూ లేఖ ఇస్తే సరిపోతుంది. కానీ ఫొటోషూట్ కు సంబంధించి మాత్రం నయనతారపై కేసులు పెట్టే ఆలోచన చేస్తున్నారు దేవస్థానం అధికారులు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులకు సమాచారం అందించారు. అలా పెళ్లితో పాటు చిక్కులు కూడా కొనితెచ్చుకుంది ఈ బ్యూటీ.

First Published:  11 Jun 2022 3:18 AM GMT
Next Story