Telugu Global
NEWS

నేను విలన్ అయితే, ఆయన హీరోనా..? ఎమ్మెల్యే వంశీ పంచ్ డైలాగులు

“2019 ఎన్నికల్లో నేను ఓ విలన్ తో పోటీ చేసి ఓడిపోయాను.. ఆయన్ను వైసీపీలోకి తెస్తుంటే వద్దని చెప్పా..” గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై, వైసీపీకే చెందిన యార్లగడ్డ వెంకట్రావు చేసిన ఆరోపణలివి. తనదైన శైలిలో ఈ ఆరోపణలను తిప్పికొట్టారు వంశీ. ‘నన్ను విలన్ అన్నవారు ఏమైనా హీరోలా..? నన్ను విమర్శిస్తున్న మీరు జస్టిస్ చౌదరి కాదు కదా.. నాపై ఆరోపణలు చేసిన ఆయన చంద్రబాబు స్కూల్ స్టూడెంటే కదా..” అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే […]

vamshi-yarlagadda-Vrao
X

“2019 ఎన్నికల్లో నేను ఓ విలన్ తో పోటీ చేసి ఓడిపోయాను.. ఆయన్ను వైసీపీలోకి తెస్తుంటే వద్దని చెప్పా..” గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై, వైసీపీకే చెందిన యార్లగడ్డ వెంకట్రావు చేసిన ఆరోపణలివి. తనదైన శైలిలో ఈ ఆరోపణలను తిప్పికొట్టారు వంశీ. ‘నన్ను విలన్ అన్నవారు ఏమైనా హీరోలా..? నన్ను విమర్శిస్తున్న మీరు జస్టిస్ చౌదరి కాదు కదా.. నాపై ఆరోపణలు చేసిన ఆయన చంద్రబాబు స్కూల్ స్టూడెంటే కదా..” అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే వంశీ.

పోయి జగన్ కి కంప్లైంట్ చేస్కో..

యార్లగడ్డ వెంకట్రావుకి సమస్యలుంటే పార్టీ నాయకత్వానికి చెప్పుకోవాలని, బహిరంగ విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు వంశీ. తనను ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నది గన్నవరం నియోజకవర్గం ప్రజలని, తాను వారికి మాత్రమే జవాబుదారీ అని చెప్పారు. తనని ఎదుర్కోవడం చేతగాక.. నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని వంశీ మండిపడ్డారు. తన కారణంగా ఎవరైనా బాధ పడుతున్నట్లయితే సీఎం జగన్‌ ని కలసి చెప్పుకోవచ్చని, వారిని తామేమీ అడ్డుకోవడం లేదన్నారు వంశీ.

నియోజకవర్గ బాధ్యతలు నావే..

గన్నవరం నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యేనని, తనకే పార్టీ ఇన్ చార్జి బాధ్యతలను అప్పగించిందని చెప్పారు వంశీ. పార్టీకి పనికొచ్చే పనులు చేయకుండా కేవలం హడావుడి చేయడం కొంతమందికి అలవాటుగా మారిందని విమర్శించారాయన. గతంలో యార్లగడ్డ విమర్శల విషయంలో వంశీ ఎప్పుడూ ప్రతి విమర్శలు చేయలేదు. అధిష్టానమే, ఆ విషయంలో జోక్యం చేసుకుని వంశీకి మద్దతుగా నిలిచింది. ఇప్పుడు మళ్లీ వైరివర్గం నుంచి విమర్శలు రావడంతో నేరుగా వంశీ రియాక్ట్ అయ్యారు. యార్లగడ్డ, చంద్రబాబు స్కూల్ స్టూడెంట్ అంటూ చురకలంటించారు.

First Published:  11 Jun 2022 6:10 AM GMT
Next Story