Telugu Global
MOVIE REVIEWS

కిన్నెరసాని మూవీ రివ్యూ

నటీనటులు – కళ్యాణ్ దేవ్, రవీంద్ర విజయ్, అన్‌ శీతల్, మహతి బిక్షు, కాశిశ్ ఖాన్ తదితరులు ద‌ర్శ‌కుడు – ర‌మ‌ణ తేజ‌ బ్యానర్ – ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్, శుభ‌మ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప్రొడక్షన్: రామ్ తళ్ళూరి నిర్మాత – రజ‌నీ త‌ళ్లూరి, ర‌వి చింత‌ల‌ క‌థ, క‌థ‌నం – దేశ్ రాజ్ సాయితేజ్ సంగీతం – మ‌హతి స్వర సాగ‌ర్ సినిమాటోగ్రాఫర్ – సురేశ్ ర‌ఘుతు ఎడిటింగ్ – అన్వ‌ర్ అలీ నిడివి – […]

kinnerasani
X

నటీనటులు – కళ్యాణ్ దేవ్, రవీంద్ర విజయ్, అన్‌ శీతల్, మహతి బిక్షు, కాశిశ్ ఖాన్ తదితరులు
ద‌ర్శ‌కుడు – ర‌మ‌ణ తేజ‌
బ్యానర్ – ఎస్.ఆర్.టి ఎంట‌ర్ టైన్మెంట్స్, శుభ‌మ్ ఎంట‌ర్ టైన్మెంట్స్
ప్రొడక్షన్: రామ్ తళ్ళూరి
నిర్మాత – రజ‌నీ త‌ళ్లూరి, ర‌వి చింత‌ల‌
క‌థ, క‌థ‌నం – దేశ్ రాజ్ సాయితేజ్
సంగీతం – మ‌హతి స్వర సాగ‌ర్
సినిమాటోగ్రాఫర్ – సురేశ్ ర‌ఘుతు
ఎడిటింగ్ – అన్వ‌ర్ అలీ
నిడివి – 2 గంటల 10 నిమిషాలు
రిలీజ్ – జూన్ 10, 2022
వేదిక – జీ5
రేటింగ్ – 2.5/5

ఓ సినిమా రిజల్ట్ ను తేల్చేది దాని సెకండాఫ్. రెండో అర్థభాగం ఎంతో బాగుంటే సినిమా ఫలితం అంత మెరుగ్గా ఉంటుంది. అందుకే చాలామంది మేకర్స్, కీలమైన సన్నివేశాలు, ట్విస్టులతో పాటు ఐటెంసాంగ్స్ లాంటివి సెకెండాఫ్ కోసం దాచిపెడతారు. ఈ విషయంలో కిన్నెరసాని సినిమా ఫెయిలైంది. మొదటి సగంలోనే ట్విస్టులు, టర్నులను వరుసపెట్టి చూపించిన దర్శకుడు.. రెండోభాగానికి వచ్చేసరికి చేతులెత్తేశాడు. సినిమాలో థ్రిల్ లేకుండా చేశాడు. అదే ఈ సినిమాకు శాపమైంది.

జమీందారీ కుటుంబం నుంచి వస్తుంది వేద (అన్ శీతల్). తన చిన్నప్పుడే ఆమె తండ్రి ఎటో వెళ్లిపోతాడు. అతడి కోసం వెదుకుతుంటుంది వేద. ఈమెకు ఓ అతీత శక్తి ఉంటుంది. ఓ మనిషి కళ్లలోకి సూటిగా చూసి, అతడు మనసులో ఏం అనుకుంటున్నాడో చెప్పేస్తుంది. అలా తండ్రి తనను, తన తల్లిని చంపబోతున్నాడనే విషయాన్ని ఆమె చిన్నప్పుడే తెలుసుకుంటుంది. ఆ క్రమంలో తండ్రికి దూరంగా పెరుగుతుంది. పెద్దయిన తర్వాత తండ్రి ఆచూకి తెలుసుకోవాలనుకుంటుంది. తనను ఎందుకు తండ్రి చంపాలనుకుంటున్నాడనే సమాధానం కోసం ప్రయత్నిస్తుంది.

ఈ క్రమంలో తను స్థాపించిన లైబ్రరీలో కిన్నెరసాని అనే పుస్తకం చూస్తుంది. అందులో తన కథే ఉంటుంది. దాన్ని రాసింది తన తండ్రే అనే విషయం తెలుసుకుంటుంది. ఈ క్రమంలో తండ్రి గతాన్ని, జ్ఞాపకాల్ని తెలుసుకునేందుకు వెంకట్ (కల్యాణ్ దేవ్) సహాయం తీసుకుంటుంది. ఇంతకీ వేదకు ఆ పుస్తకానికి సంబంధం ఏంటి? కన్నతండ్రి ఎఁదుకు ఆమెను చంపాలనుకుంటున్నాడు? వీళ్లిద్దరి కథలోకి వెంకట్ ఎందుకొచ్చాడు? చివరికి ఏం జరిగింది? అనేది కిన్నెరసాని కథ.

మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీ ఇది. కానీ ఆ ఎలిమెంట్స్ అన్నింటినీ ఫస్టాఫ్ లోనే చూపించేశాడు దర్శకుడు రమణతేజ. ఇతడు ఎంచుకున్న పాయింట్ చాలా బాగుంది. కానీ దానిచుట్టూ అల్లుకున్న సన్నివేశాలు, స్క్రీన్ ప్లే బాగాలేదు. ఉదాహరణకు ఫస్టాఫ్ నే తీసుకుంటే, సినిమా ప్రారంభమైన 40 నిమిషాల వరకు అసలేం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి. ఆ తర్వాత ట్విస్టుల్ని వరసపెట్టి చెప్పేశాడు. ఇంటర్వెల్ కార్డు వేసిన తర్వాత మళ్లీ కథలో థ్రిల్ మిస్ అయింది. క్లైమాక్స్ కు వచ్చేసరికి ఇంతేనా అనిపిస్తుంది.

థ్రిల్లర్ జానర్ సినిమాలకు ఓస్ ఇంతేనా అనే ఫీలింగ్ మంచిది కాదు. టైటిల్స్ నుంచి శుభం కార్డు వరకు ఎంత ఉత్కంఠగా కథ చెప్పామనేది ముఖ్యం. ఈ విషయంలో దర్శకుడు రమణతేజతో పాటు.. స్క్రీన్ ప్లే రైటర్ దేశరాజ్ సాయితేజ్ ఫెయిల్ అయ్యారు. ప్రీ క్లైమాక్స్ లో సన్నివేశాల్ని మరింత బాగా తీసి ఉంటే బాగుండేది. ఇక పుస్తకం కాన్సెప్ట్ ను పరిచయం చేసిన దర్శకుడు.. దాని చుట్టూ మరిన్ని సన్నివేశాలు రాసుకుంటే బాగుండేది.

ఇవన్నీ పక్కనపెడితే.. హీరోను ఈ కథలో ఇరికించడానికి దర్శకుడు-రచయిత తెగ కష్టపడ్డారు. హీరోను, ఈ కథను మరింత బాగా కనెక్ట్ చేసుంటే బాగుండేది. ఇంకా చెప్పాలంటే కల్యాణ్ దేవ్ పాత్రను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. అయితే ఈసారి కల్యాణ్ దేవ్ తన యాక్టింగ్ తో అలరించాడు. సూపర్ మచ్చి సినిమాతో విమర్శలు ఎదుర్కొన్న ఈ నటుడు, కిన్నెరసానిలో మాత్రం సెటిల్ యాక్టింగ్ చేశాడు. హీరోయిన్లు కశిష్ ఖాన్, శీతల్ బాగా చేశారు. హీరోయిన్ తండ్రి పాత్ర పోషించిన రవీంద్ర విజయ్, ఈ సినిమాకు బ్యాక్ బోన్ గా నిలిచాడు.

టెక్నికల్ గా సినిమా ఏమంత మెప్పించలేకపోయింది. సినిమాటోగ్రఫీ కథకు తగ్గట్టుగా ఉంది. మెరుపుల్లేవ్. మహతి స్వరసాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. అన్వర్ అలీ ఎడిటింగ్ బాగున్నప్పటికీ, ఇంకా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. బహుశా నిడివి తగ్గిపోతోందని వదిలేసినట్టున్నారు. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఓవరాల్ గా కిన్నెరసాని సినిమాను కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ కోసం చూడొచ్చు. ఫస్టాఫ్ బాగున్నప్పటికీ, సెకండాఫ్ లో సస్పెన్స్ మిస్ అవ్వడం ఈ సినిమాలో ప్రధానమైన లోపం.

First Published:  11 Jun 2022 2:21 AM GMT
Next Story