Telugu Global
NEWS

అనుమతి లేకుండా అన్న క్యాంటీన్.. ఆపై రాజకీయ రగడ..

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో అన్న క్యాంటీన్లను మూసివేసింది. అప్పట్లో ఈ వ్యవహారంపై టీడీపీ పెద్ద రాద్ధాంతమే చేసింది. అయితే ఇటీవల మహానాడు సందర్భంగా అక్కడక్కడా అన్న క్యాంటీన్లను తెరిచి టీడీపీ హడావిడి చేసింది. ఎన్నారై ఫండ్స్ తో ఈ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. తాజాగా బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మంగళగిరిలో కూడా ఇలాంటి హడావిడే చేశారు టీడీపీ నేతలు. బహిరంగ ప్రదేశంలో ఎన్టీఆర్ విగ్రహం పక్కన ఈ ఏర్పాటు చేశారు. అయితే […]

anna-canteen
X

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో అన్న క్యాంటీన్లను మూసివేసింది. అప్పట్లో ఈ వ్యవహారంపై టీడీపీ పెద్ద రాద్ధాంతమే చేసింది. అయితే ఇటీవల మహానాడు సందర్భంగా అక్కడక్కడా అన్న క్యాంటీన్లను తెరిచి టీడీపీ హడావిడి చేసింది. ఎన్నారై ఫండ్స్ తో ఈ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది. తాజాగా బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా మంగళగిరిలో కూడా ఇలాంటి హడావిడే చేశారు టీడీపీ నేతలు. బహిరంగ ప్రదేశంలో ఎన్టీఆర్ విగ్రహం పక్కన ఈ ఏర్పాటు చేశారు. అయితే అనుమతులు లేవంటూ కార్పొరేషన్ అధికారులు అన్న క్యాంటీన్ ఏర్పాటుని అడ్డుకున్నారు. దీంతో అక్కడ గొడవ మొదలైంది.

అన్న క్యాంటీన్లను కేవలం రాద్ధాంతం చేయడం కోసమే ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ప్రైవేటుగా క్యాంటీన్లను నడపడం సాధ్యం కాదని తెలిసినా, కేవలం గొడవల కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. అనుకున్నట్టుగానే మంగళగిరిలో అన్న క్యాంటీన్ ఏర్పాటు రసాభాసగా మారింది. మరోవైపు టీడీపీ నేతలు మాత్రం క్యాంటీన్ ఏర్పాటుని అడ్డుకోవడం సరికాదని అంటున్నారు. ప్రభుత్వం పెట్టకపోయినా, తమ పార్టీ ఆధ్వర్యంలో పేదల కడుపు నింపడానికి అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నామని, దీనిపై ఇంత రాద్ధాంతం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.

పార్టీ ఆఫీస్ లో పెట్టుకోలేరా..?

పార్టీ తరపున క్యాంటీన్ పెట్టాలనుకుంటే.. టీడీపీ ఆఫీస్ లోనే అన్న క్యాంటీన్లు తెరవాలని, జిల్లాల్లో కూడా అదే పని చేయాలని సలహా ఇస్తున్నారు వైసీపీ నేతలు. కేవలం ప్రభుత్వంపై నిందలు వేయాలనే ఉద్దేశంతోటే.. నాలుగు రోడ్ల కూడలిలో క్యాంటీన్ పెట్టాలనుకోవడం సరికాదంటున్నారు. మంగళగిరిలో అన్న క్యాంటీన్ ఏర్పాటుపై రెండుసార్లు వాదోపవాదాలు జరిగాయి. తాత్కాలిక నిర్మాణాలను కార్పొరేషన్ అధికారులు రెండుసార్లు తొలగించారు. కార్పొరేషన్ సిబ్బందిపై దౌర్జన్యం చేస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు గుంటూరు జిల్లా టీడీపీ నేతల్ని, కార్యకర్తలను అరెస్ట్ చేసి పెదకాకాని, తాడేపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు. మంగళగిరి అన్న క్యాంటీన్ ఏర్పాటు వివాదాలకు కేంద్ర బిందువైంది. మరోసారి అధికార, ప్రతిపక్షాల మధ్య గొడవకు కారణమైంది.

First Published:  9 Jun 2022 10:09 PM GMT
Next Story