Telugu Global
National

దేశంలో ఇక 12 గంటల పని…జూలై1 నుంచి కొత్త కార్మిక చట్టాలు !

జూలై1 నుండి కొత్త కార్మిక చట్టాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇది అమలులోకి వస్తే, కార్యాలయ పని వేళలు, ఉద్యోగుల భవిష్య నిధి (EPF), కంట్రిబూషన్ చేతికొచ్చే వేతనాలలో గణనీయమైన మార్పు ఉంటుంది. ఆఫీసు వేళలు మరియు పిఎఫ్ కంట్రిబూషన్ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, చేతికొచ్చే వేతనం మాత్రం తగ్గుతుంది. నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను వీలైనంత త్వరగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త కార్మిక చట్టాల వల్ల దేశంలో పెట్టుబడులు […]

office work
X

జూలై1 నుండి కొత్త కార్మిక చట్టాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇది అమలులోకి వస్తే, కార్యాలయ పని వేళలు, ఉద్యోగుల భవిష్య నిధి (EPF), కంట్రిబూషన్ చేతికొచ్చే వేతనాలలో గణనీయమైన మార్పు ఉంటుంది. ఆఫీసు వేళలు మరియు పిఎఫ్ కంట్రిబూషన్ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, చేతికొచ్చే వేతనం మాత్రం తగ్గుతుంది.

నాలుగు కొత్త లేబర్ కోడ్‌లను వీలైనంత త్వరగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొత్త కార్మిక చట్టాల వల్ల దేశంలో పెట్టుబడులు పెరుగుతాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

కొత్త కార్మిక చట్టం అమల్లోకి వస్తే మార్పులు?

1. కొత్త కార్మిక చట్టాలు అమలైతే, ఆఫీస్ పని వేళలను గణనీయంగా మార్చుకోవడానికి కంపెనీలకు అనుమతి లభిస్తుంది. వారు ఆఫీసు పని గంటలను 8-9 గంటల నుండి 12 గంటల వరకు పెంచవచ్చు. అయితే తమ ఉద్యోగులకు మూడు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వాల్సి ఉంటుంది.వారంలో మొత్తం పని గంటలను మాత్రం మార్చకూడదనే ఆలోచన ఉంది.

2. అదనంగా, పరిశ్రమల్లో త్రైమాసికంలో కార్మికులకు గరిష్ట ఓవర్‌టైమ్ గంటల సంఖ్య 50 గంటల (ఫ్యాక్టరీల చట్టం ప్రకారం) నుండి 125 గంటలకు (కొత్త లేబర్ కోడ్‌లలో) పెంచబడింది.

3. టేక్-హోమ్ జీతం కాంపోనెంట్, ప్రావిడెంట్ ఫండ్‌కు యజమానుల కంట్రిబూషన్ లో గణనీయమైన మార్పు ఉంటుంది. కొత్త కోడ్‌లు ఉద్యోగి యొక్క బేసిక్ సాలరీ, గ్రాస్ సాలరీలో 50%గా ఉంచవచ్చు. ఇది ఉద్యోగి, యజమానుల‌ PF కంట్రిబూషన్ ను పెంచుతుంది. కొంతమంది ఉద్యోగులకు, ముఖ్యంగా ప్రైవేట్ రంగంలోని వారికి టేక్-హోమ్ జీతం బాగా తగ్గుతుంది.

4. పదవీ విరమణ తర్వాత వచ్చే డబ్బు, గ్రాట్యుటీ మొత్తం కూడా పెరుగుతుంది.

5. కార్మికుడు అతని/ఆమె ఉద్యోగ సమయంలో పొందగలిగే సెలవులను హేతుబద్ధీకరించడం, సెలవును తదుపరి సంవత్సరానికి కొనసాగించడం, ఉద్యోగ కాల వ్యవధిలో సెలవులను క్యాష్ చేసుకోవడం ఉంటుంది.

ఏదేమైనప్పటికీ, సెలవుల సంఖ్య‌ మాత్రం మారదు, అంటే ప్రతి 20 రోజుల పనికి 1 రోజు సెలవు ఉంటు‍ంది. అదేవిధంగా, 30 రోజుల వరకు ఉన్న లీవ్ ల‌ ఫార్వర్డ్ క్యారీ పరిమితిలో ఎటువంటి మార్పు ప్రతిపాదించబడలేదు.

Next Story