Telugu Global
NEWS

టీ-20లో లేలేత కెప్టెన్లు! రైనా తర్వాతి స్థానంలో రిషభ్

భారత యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ఓ అరుదైన ఘనతను దక్కించుకొన్నాడు. దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన ప్రస్తుత టీ-20 సిరీస్ ద్వారా సారధిగా అరంగేట్రం చేయడం ద్వారా అత్యంత పిన్నవయసులో భారతజట్టు పగ్గాలు చేపట్టిన రెండో ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు. రాహుల్ కు గాయం…రిషభ్ కు వరం.. దక్షిణాఫ్రికాతో సిరీస్ కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ లాంటి పలువురు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంతో..స్టాప్ గ్యాప్ కెప్టెన్ గా కెఎల్ రాహుల్ కు […]

Rishabh Pant
X

భారత యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ఓ అరుదైన ఘనతను దక్కించుకొన్నాడు. దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన ప్రస్తుత టీ-20 సిరీస్ ద్వారా సారధిగా

అరంగేట్రం చేయడం ద్వారా అత్యంత పిన్నవయసులో భారతజట్టు పగ్గాలు చేపట్టిన రెండో ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు.

రాహుల్ కు గాయం…రిషభ్ కు వరం..

దక్షిణాఫ్రికాతో సిరీస్ కు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ లాంటి పలువురు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంతో..స్టాప్ గ్యాప్ కెప్టెన్ గా కెఎల్ రాహుల్ కు బాధ్యతలు అప్పజెప్పారు. రాహుల్ గాయంతో అందుబాటులో లేకపోడంతో కెప్టెన్సీ అవకాశం వచ్చి అనూహ్యంగా రిషభ్ పంత్ కు చిక్కింది.

ఐపీఎల్ లో గత రెండుసీజన్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ కు నాయకత్వం వహిస్తున్న రిషభ్.. న్యూఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో ముగిసిన తొలి టీ-20 మ్యాచ్ ద్వారా భారత టీ-20 జట్టుకు సైతం నాయకత్వం వహించగలిగాడు.

అప్పుడు రైనా..ఇప్పుడు రిషభ్..

టీ-20 క్రికెట్లో భారతజట్టుకు అత్యంత పిన్నవయసులో నాయకత్వం వహించిన ఆటగాడి రికార్డు సురేశ్ రైనా పేరుతో ఉంది. రైనా 23 సంవత్సరాల 197 రోజుల వయసులోనే టీమిండియా టీ-20జట్టు పగ్గాలు చేపట్టాడు.

రిషభ్ పంత్ మాత్రం 24 సంవత్సరాల 248 రోజుల వయసుతో రైనా తర్వాతిస్థానంలో నిలిచాడు.మహేంద్ర సింగ్ ధోని 26 ఏళ్ల 68 రోజుల వయసుతో మూడు, అజింక్యా రహానే 27 ఏళ్ల 41 వయసుతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.

చేజారిన వరుస విజయాల రికార్డు..

నూఢిల్లీ వేదికగా ముగిసిన తొలి టీ-20లో భారత్ కు ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పే అవకాశం లేకుండా దక్షిణాఫ్రికా అడ్డుకొంది.

ప్రస్తుత సిరీస్ కు ముందు వరకూ భారతజట్టు 12 వరుస టీ-20 విజయాలతో పలుజట్ల పేరుతో ఉన్న రికార్డును సమం చేసింది. అయితే..వరుసగా 13వ విజయంతో

ప్రపంచ రికార్డు నెలకొల్పాలన్న భారత ఆశల్ని సఫారీ హిట్టర్లు డ్యూసెన్, మిల్లర్ అడియాసలు చేశారు.

టీ-20 ప్రపంచ కప్ నుంచి…

2021 టీ-20 ప్రపంచకప్ లో వరుసగా పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల చేతిలో ఓడి ఆ టోర్నీ నుంచి అర్థంతరంగా నిష్క్రమించిన భారతజట్టు..ఆ తర్వాత వరుసగా 12 విజయాలు నమోదు చేసింది. టీ-20 ప్రపంచకప్ లో విరాట్ కోహ్లి కెప్టెన్ గా 3 మ్యాచులు నెగ్గిన భారత్ ఆ తర్వాత ఓటమన్నదే లేకుండా డజను విజయాలు నమోదు చేసింది.

టీ20 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్ తో ముగిసిన స్వదేశీ సిరీస్ ను 3-0తో నెగ్గిన భారత్ కు ఈ సిరీస్ నుంచే రోహిత్ శర్మ పూర్తి స్థాయి సారథిగా బాధ్యతలు చేపట్టాడు.. ఆ తర్వాత ఫిబ్రవరిలో వెస్టిండీస్ పై 3-0, మార్చిలో శ్రీలం పై 3-0 విజయాలు నమోదు చేసింది.. దీంతో ఇప్పటివరకు వరుసగా 12 మ్యాచులలో అపజయమన్నదే లేకుండా నిలిచింది
2016 నుంచి 2018 వరకు ఆఫ్ఘనిస్తాన్.. వరుసగా 12 టీ20 లు గెలిచింది. ఒక 2020 అక్టోబర్ నుంచి 2021 సెప్టెంబర్ వరకు రొమేనియా ఇదే ఫీట్ ను నమోదు చేశాయి.

భారత్ సైతం 12 వరుస విజయాలతో మిగిలిన రెండుజ్టట్ల సరసన నిలిచినా 13వ విజయం సాధించడంలో విఫలం కాక తప్పలేదు.

భారత్ సైతం వరుసగా 12 మ్యాచ్ లు నెగ్గడం ద్వారా అత్యధిక వరుస విజయాల రికార్డును సమం చేయగలిగినా..13వ విజయం సాధించలేక చతికిలబడాల్సి వచ్చింది.

First Published:  9 Jun 2022 10:49 PM GMT
Next Story