Telugu Global
NEWS

టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు స్పెషల్ క్లాస్ లు.. ఈనెల 13నుంచి మొదలు..

ఏపీలో ఈ ఏడాది టెన్త్ క్లాస్ పరీక్ష ఫలితాల్లో పాస్ పర్సంటేజీ బాగా తగ్గిపోవడంతో ప్రభుత్వం విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటోంది. అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ కూడా ప్రకటించేసింది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైతే కంపార్ట్ మెంటల్ పాస్ అనే ప్రస్తావన లేకుండా చేస్తామని చెప్పింది. సాధారణ విద్యార్థుల లాగే గ్రేడ్లు కేటాయిస్తామంది. అదే సమయంలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని చెప్పింది. ఈనెల 13నుంచి స్పెషల్ క్లాస్ లు.. పదో తరగతి […]

టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు స్పెషల్ క్లాస్ లు.. ఈనెల 13నుంచి మొదలు..
X

ఏపీలో ఈ ఏడాది టెన్త్ క్లాస్ పరీక్ష ఫలితాల్లో పాస్ పర్సంటేజీ బాగా తగ్గిపోవడంతో ప్రభుత్వం విద్యార్థులు నష్టపోకుండా చర్యలు తీసుకుంటోంది. అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ కూడా ప్రకటించేసింది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైతే కంపార్ట్ మెంటల్ పాస్ అనే ప్రస్తావన లేకుండా చేస్తామని చెప్పింది. సాధారణ విద్యార్థుల లాగే గ్రేడ్లు కేటాయిస్తామంది. అదే సమయంలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని చెప్పింది.

ఈనెల 13నుంచి స్పెషల్ క్లాస్ లు..

పదో తరగతి ఫెయిలైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈనెల 13నుంచి ఆయా స్కూళ్లలో ప్రత్యేత తరగతులు జరుగుతాయి. రోజుకి రెండు సబ్జెక్ట్ లపై బోధన ఉంటుంది. ఆయా సబ్జెక్టులలో ఫెయిలైన విద్యార్థులు తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది. డీఈవోలు సమీక్ష నిర్వహించాలని 13వతేదీ నుంచి టైమ్ టేబుల్ అమలు చేయాలని పాఠశాల విద్యా కమిషనర్ సురేష్ కుమార్ మార్గదర్శకాలు విడుదల చేశారు.

6,15,908మంది విద్యార్థులు ఈ ఏడాది టెన్త్ పరీక్షలకు హాజరు కాగా.. 2,01,627మంది ఫెయిలయ్యారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకోసం స్పెషల్ క్లాస్ లు మొదలుకాబోతున్నాయి. ఫెయిలైన విద్యార్థులంతా తరగతులకు హాజరయ్యే బాధ్యతను హెడ్మాస్టర్లకు అప్పగించారు. గూగుల్ ఫామ్ ద్వారా రోజువారీ అటెండెన్స్ పై కూడా నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది. రెమిడియల్ తరగతులు ఉదయం 8.30నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు.

ఫెయిలైన విద్యార్థులకోసం ప్రభుత్వం క్లాసులు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయగా.. మరోవైపు ఉపాధ్యాయులపై ఇది అదనపు భారంగా మారే అవకాశముందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది వేసవి సెలవల్లో ఉపాధ్యాయులకు రికార్డ్ వర్క్ అదనంగా ఇచ్చారు. ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లల రెమెడియల్ తరగతుల బాధ్యత అదనంగా వారిపై పడుతోంది.

First Published:  10 Jun 2022 12:31 AM GMT
Next Story