Telugu Global
NEWS

చంద్రబాబు, లోకేష్‌ శంకించారు.. అందుకే..

పులివెందుల‌లో గెలుపుపై టీడీపీ పెద్దలకు కూడా భ్రమలు లేవు. వెన్నుపోట్ల కారణంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డిని ఓడించడం మినహా ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో టీడీపీ సాధించిన ఘనత అంటూ ఏమీ లేదు. అయినా అక్కడా టీడీపీలో వర్గాలకు ఏర్పడ్డాయి. 2019 ఎన్నికల తర్వాత జంక్షన్‌లో నిలబడ్డ మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్‌ కొన్ని కండిషన్లతో తిరిగి టీడీపీలో జాయిన్ అయ్యేందుకు ఓకే అంటున్నారు. అదే సమయంలో సతీష్ రెడ్డి రాకను అడ్డుకునేందుకు ఎమ్మెల్సీ బీటెక్ […]

చంద్రబాబు, లోకేష్‌ శంకించారు.. అందుకే..
X

పులివెందుల‌లో గెలుపుపై టీడీపీ పెద్దలకు కూడా భ్రమలు లేవు. వెన్నుపోట్ల కారణంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డిని ఓడించడం మినహా ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో టీడీపీ సాధించిన ఘనత అంటూ ఏమీ లేదు. అయినా అక్కడా టీడీపీలో వర్గాలకు ఏర్పడ్డాయి.

2019 ఎన్నికల తర్వాత జంక్షన్‌లో నిలబడ్డ మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్‌ కొన్ని కండిషన్లతో తిరిగి టీడీపీలో జాయిన్ అయ్యేందుకు ఓకే అంటున్నారు. అదే సమయంలో సతీష్ రెడ్డి రాకను అడ్డుకునేందుకు ఎమ్మెల్సీ బీటెక్ రవి పావులు కదుపుతున్నారు. గెలవకపోయినా పులివెందుల ఇన్‌చార్జ్ అనిపించుకుంటే చాలు అన్నట్టుగా నేతల తీరుంది.

ఎమ్మెల్సీ బీటెక్‌ రవి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పార్టీ నేతలను, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారంటూ.. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేర్ల పార్థసారథి రెడ్డితో పాటు పులివెందుల సెగ్మెంట్‌ పరిధిలోని మండలస్థాయి నాయకులు పలువురు గురువారం సతీష్ రెడ్డిని కలిశారు. బీటెక్ రవి కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని..

కాబట్టి తిరిగి పార్టీలోకి వచ్చి నియోజకవర్గ బాధ్యతలు చేపట్టాలని వారు సతీష్ రెడ్డిని కోరారు. అందుకు స్పందించిన సతీష్ రెడ్డి.. తాను 30ఏళ్ల పాటు నిజాయితీగా అన్ని ఇబ్బందులను తట్టుకుని పనిచేస్తే.. చివరకు తనను ”అమ్ముడుపోయావ్” అన్నట్టుగా చంద్రబాబు, లోకేష్ మాట్లాడారని సతీష్ రెడ్డి ఆవేదన చెందినట్టు సమాచారం. అందుకే తాను పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందన్నారు.

టీడీపీలోకి వచ్చేందుకు తనకు అభ్యంతరం లేదని.. కానీ, తిరిగి సముచిత స్థానంతో పాటు పులివెందుల ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగిస్తేనే పార్టీలోకి వస్తానని సతీష్ రెడ్డి తేల్చిచెప్పారు. సరైన గౌరవం లేని చోట తాను పనిచేయలేనని తేల్చేశారు. దీంతో టీడీపీ నేతలు తామంతా చంద్రబాబు, నారా లోకేష్‌ను కలిసి ఒప్పిస్తామని చెప్పి వెళ్లిపోయారు.

ఈ భేటీపై అటు బీటెక్ రవి టీడీపీ పెద్దలకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. పార్టీలో లేని వ్యక్తి దగ్గరకు.. పార్టీకి సమాచారం ఇవ్వకుండా టీడీపీ నేతలు వెళ్లి కలవడం క్రమశిక్షణారాహిత్యమేనని ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

గతంలో సతీష్ రెడ్డి పార్టీలో ఉన్నప్పుడు ఆయనకు సన్నిహితులుగా ఉన్న టీడీపీ నేతలను బీటెక్ రవి ఇబ్బంది పెడుతున్నారన్న అభిప్రాయం ఉంది. మొత్తం మీద 2019 తర్వాత టీడీపీ నుంచి బయటకు వచ్చి ఏ పార్టీలో చేరని సతీష్ రెడ్డి తిరిగి టీడీపీలో చేరేందుకైతే రంగం సిద్ధమవుతున్నట్టుగా ఉంది. ఇందుకు బీటెక్ రవి నుంచి ఏ స్థాయిలో ప్రతిఘటన ఉంటుంది అన్నది చూడాలి. చంద్రబాబు అయితే కలిసి వచ్చే ప్రతి ఒక్కరినీ పార్టీలోకి తీసుకోవాలన్న ఆలోచనతోనే ఉన్నారు.

First Published:  8 Jun 2022 9:01 PM GMT
Next Story