Telugu Global
National

ఆప్షన్లు పెరిగాయి.. రాజీనామాలూ పెరుగుతున్నాయి..

భారత్ లో కొవిడ్ సంక్షోభం కారణంగా వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకరకంగా అప్పట్లో వారు ఇబ్బందులు పడ్డా.. ఆ తర్వాత చాలామంది సొంత ప్రాంతంలోనే పనులకు కుదురుకున్నారు. కొంతమంది తమ వృత్తి నైపుణ్యాలను మెరుగు పరచుకుని, కొత్త ఉపాధి మార్గాలు వెదుక్కున్నారు. ఇక టెక్నాలజీ రంగంలో కొవిడ్ ఓ విప్లవాత్మక మార్పునే తీసుకొచ్చిందని చెప్పాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ తో ఉద్యోగులకు భారీ వెసులుబాటు దక్కింది. వీటన్నిటితోపాటు “గ్రేట్ రిజిగ్నేషన్ ట్రెండ్” అనేది […]

ఆప్షన్లు పెరిగాయి.. రాజీనామాలూ పెరుగుతున్నాయి..
X

భారత్ లో కొవిడ్ సంక్షోభం కారణంగా వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒకరకంగా అప్పట్లో వారు ఇబ్బందులు పడ్డా.. ఆ తర్వాత చాలామంది సొంత ప్రాంతంలోనే పనులకు కుదురుకున్నారు. కొంతమంది తమ వృత్తి నైపుణ్యాలను మెరుగు పరచుకుని, కొత్త ఉపాధి మార్గాలు వెదుక్కున్నారు. ఇక టెక్నాలజీ రంగంలో కొవిడ్ ఓ విప్లవాత్మక మార్పునే తీసుకొచ్చిందని చెప్పాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ తో ఉద్యోగులకు భారీ వెసులుబాటు దక్కింది. వీటన్నిటితోపాటు “గ్రేట్ రిజిగ్నేషన్ ట్రెండ్” అనేది కొవిడ్ వల్ల వచ్చిన మరో ఊహించని పరిణామం.

అసలేంటీ ట్రెండ్..

కొవిడ్ కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ తో చాలామంది టెన్షన్ లేని ఉద్యోగాలకు అలవాటు పడ్డారు. అదే సమయంలో డబ్బుతోపాటు ఆరోగ్యం కూడా ముఖ్యమనే జీవిత సత్యం తెలుసుకున్నారు. ప్రమోషన్లకోసం వెంపర్లాడటం తగ్గించుకున్నారు. దీంతో ఆయా సంస్థలనుంచి ఒత్తిడి వస్తే, ముందూ వెనకా ఆలోచించకుండా రాజీనామా చేయడం అలవాటు చేసుకున్నారు. కొత్త ఉద్యోగంలో కోరుకున్న జీతం లేకపోయినా.. అడ్జస్ట్ అయిపోవడం మొదలైంది. ముందుగా అమెరికాలో ఈ “గ్రేట్ రిజిగ్నేషన్ ట్రెండ్” మొదలైంది. ఆ తర్వాత మెల్లగా అది భారత్ కి కూడా పాకింది. ఉపాధి మార్గాలను మార్చుకునే ట్రెండ్ కూడా భారీగా పెరిగింది. దీంతో రాజీనామాల సంఖ్య కూడా పెరిగింది.

భారత్ లో ఈ ఏడాది కూడా “గ్రేట్ రిజిగ్నేషన్ ట్రెండ్” కొనసాగుతుందని, రాబోయే ఆరు నెలల్లో 86 శాతం మందికి పైగా ఉద్యోగులు వివిధ కంపెనీలకు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారని రిక్రూట్‌ మెంట్‌ ఏజెన్సీ మైఖేల్‌ పేజ్‌ నివేదిక పేర్కొంది. తక్కువ పని, కుటుంబంతో ఆనందం గడిపేందుకు సమయం కోసం చాలామంది తక్కువ జీతాలను తీసుకోవడానికి, అవసరమైతే ప్రమోషన్లను సైతం వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నారని, అలాంటివారు 61 శాతం మంది ఉన్నారని ఆ నివేదిక సారాంశం.

కంపెనీపై అసంతృప్తి, జీతం, ఇండస్ట్రీ మార్పు కోరుకోవడం, కెరీర్ లో అభివృద్ధిని కోరుకోవడంతో.. చాలామంది తాము పనిచేస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేసి కొత్తవాటిని వెదుక్కుంటున్నారని, అందుకే ఇటీవల కాలంలో భారత్ లో కూడా రాజీనామాలు భారీగా పెరిగాయని అంచనా వేస్తున్నారు. అయితే అదే సమయంలో కొత్తవారికి కూడా అవకాశాలు మెరుగవడం విశేషం.

First Published:  8 Jun 2022 8:48 PM GMT
Next Story