Telugu Global
MOVIE UPDATES

విఘ్నేష్ ను పెళ్లాడిన నయనతార

స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ఓ ఇంటివారయ్యారు. వీళ్ల పెళ్లి ఈ రోజు అంగరంగ వైభవంగా జరిగింది. చెన్నైకి సమీపంలో ఉన్న మహాబలిపురంలో ఓ ఫైవ్ స్టార్ రిసార్ట్ హోటల్ లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు, ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యారు. ఎరుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయింది నయనతార. ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు విఘ్నేష్ శివన్. ఆ తర్వాత ఇద్దరూ వెళ్లి, సూపర్ […]

nayanthara vignesh wedding
X

స్టార్ హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ఓ ఇంటివారయ్యారు. వీళ్ల పెళ్లి ఈ రోజు అంగరంగ వైభవంగా జరిగింది. చెన్నైకి సమీపంలో ఉన్న మహాబలిపురంలో ఓ ఫైవ్ స్టార్ రిసార్ట్ హోటల్ లో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు, ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యారు.

ఎరుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయింది నయనతార. ఆమె మెడలో మూడు ముళ్లు వేశాడు విఘ్నేష్ శివన్. ఆ తర్వాత ఇద్దరూ వెళ్లి, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ పెళ్లికి రజనీకాంత్ పాటు.. షారూక్ ఖాన్, సూర్య, కార్తి, కేఎస్ రవికుమార్, ఎస్ జే సూర్య, అనిరుధ్ తదితరులు హాజరయ్యారు.

తమ పెళ్లి సందర్భంగా తమిళనాడులో లక్షమంది అనాథలు, పేదలకు అన్నదానం చేశారు నయనతార-విఘ్నేష్. పలు దేవాయలతో పాటు, అనాథాశ్రమాల్లో ఈ అన్నదాన కార్యక్రమం జరిగింది.

ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు నయన్, విఘ్నేష్. గతేడాది వీళ్లు నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ ఏడాది పెళ్లితో ఒకటయ్యారు. నిజానికి వీళ్లు తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో వేదిక మహాబలిపురానికి మారింది. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానని నయనతార ప్రకటించింది.

First Published:  9 Jun 2022 8:15 AM GMT
Next Story