Telugu Global
National

నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ తో సహా జర్నలిస్టు సబా నఖ్వీలపై కేసు నమోదు

ద్వేషపూరిత సందేశాలను వ్యాప్తి చేయడం, వివిధ సమూహాలను రెచ్చగొట్టడం, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించడం వంటి ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు పలువురు ప్రముఖులపై కేసు నమోదు చేశారు. ఈ మధ్య అంతర్జాతీయంగా వివాదాస్పదమైన బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, ఢిల్లీ బీజేపీ మీడియా విభాగం అధిపతి నవీన్ కుమార్ జిందాల్ తో సహా జర్నలిస్టు సబా నఖ్వీ, పీస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి షాదాబ్ చౌహాన్ , హిందూ మహాసభ ఆఫీస్ బేరర్ పూజా […]

journalist-saba-naqvi-named-in-delhi-police-case-over-hate-on-social-media
X

ద్వేషపూరిత సందేశాలను వ్యాప్తి చేయడం, వివిధ సమూహాలను రెచ్చగొట్టడం, ప్రజల ప్రశాంతతకు భంగం కలిగించడం వంటి ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు పలువురు ప్రముఖులపై కేసు నమోదు చేశారు.

ఈ మధ్య అంతర్జాతీయంగా వివాదాస్పదమైన బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ, ఢిల్లీ బీజేపీ మీడియా విభాగం అధిపతి నవీన్ కుమార్ జిందాల్ తో సహా జర్నలిస్టు సబా నఖ్వీ, పీస్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి షాదాబ్ చౌహాన్ , హిందూ మహాసభ ఆఫీస్ బేరర్ పూజా శకున్ పాండే, రాజస్థాన్‌కు చెందిన మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహ్మాన్, అనిల్ కుమార్ మీనా, గుల్జార్ అన్సారీలతో పాటు మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేసిన నెటిజనులపై కేసు నమోదు చేశారు.

ఇందులో నుపుర్ శర్మ, పలువురు సోషల్ మీడియా వినియోగదారులపై ఒక ఎఫ్ ఐ ఆర్, మిగతావారిపై మరొక ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్టు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్(IFSO) KPS మల్హోత్రా తెలిపారు. మతాలకు అతీతంగా అనేక మంది వ్యక్తులపై FIR నమోదు చేసినట్టు ఆయన చెప్పారు.

First Published:  8 Jun 2022 11:50 PM GMT
Next Story