Telugu Global
MOVIE UPDATES

చోర్ బజార్ ట్రయిలర్ రివ్యూ

ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ హీరోయిన్. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా అతి త్వరలో థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “చోర్ బజార్” సినిమా ట్రైలర్ ను ఈరోజు బాలకృష్ణ విడుదల చేశారు. యూనిట్ కు అభినందలు తెలిపారు. […]

Chor Bazar
X

ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’. గెహన సిప్పీ హీరోయిన్. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు నిర్మించిన ఈ సినిమా అతి త్వరలో థియేటర్ లలో విడుదలకు సిద్ధమవుతోంది. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “చోర్ బజార్” సినిమా ట్రైలర్ ను ఈరోజు బాలకృష్ణ విడుదల చేశారు. యూనిట్ కు అభినందలు తెలిపారు.

ఇక ట్రయిలర్ విషయానికొస్తే.. చోర్ బజార్ ట్రైలర్ లో హీరో ఆకాష్, బచ్చన్ సాబ్ అనే క్యారెక్టర్ తో మాస్ బాడీ లాంగ్వేజ్ తో కనిపిస్తున్నాడు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఒక దూల ఉంటుంది. నాకు చేతి దూల. 20 నిమిషాల్లో 30 టైర్స్ విప్పేస్తా నా దిల్ కా దఢకన్ కోసం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కొట్టాలి అంటూ ఆకాష్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.

అయితే ఇది ప్రేమకథ మాత్రమే కాదు. ఈ ప్రేమకథకు డైమండ్ మిస్సింగ్ ఎలిమెంట్ పెట్టడం ద్వారా కంప్లీట్ కమర్షియాలిటీ తీసుకొచ్చారు దర్శకుడు జీవన్ రెడ్డి.ట్రయిలర్ లో సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. ఈ నెలలోనే థియేటర్లలోకి వస్తోంది చోర్ బజార్. ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రావాలనుకుంటున్నాడు ఆకాష్. ఇతడు నటించిన గత చిత్రం రొమాంటిక్, అట్టర్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.

First Published:  9 Jun 2022 8:10 AM GMT
Next Story