Telugu Global
MOVIE UPDATES

బాలయ్య ఫస్ట్ హంట్ అదిరింది

NBK107 గా పాపులర్ అయిన నందమూరి బాలకృష్ణ చిత్రం నుంచి టీజర్ వచ్చింది. దీనికి ది ఫస్ట్ హంట్ అనే పేరు పెట్టారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ టీజర్ విడుదలైంది. తొలి వేట మాస్ యాక్షన్స్, డైలాగ్స్ తో సాగింది. దర్శకుడు గోపీచంద్ మలినేని, బాలయ్య పాత్రను పవర్ ఫుల్ గా డిజైన్ చేసినట్లు టీజర్ చూస్తే అర్థమౌతోంది. టీజర్‌లో బాలకృష్ణ చెప్పిన ఒక్కో డైలాగ్ మాస్‌ని కట్టిపడేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా […]

బాలయ్య ఫస్ట్ హంట్ అదిరింది
X

NBK107 గా పాపులర్ అయిన నందమూరి బాలకృష్ణ చిత్రం నుంచి టీజర్ వచ్చింది. దీనికి ది ఫస్ట్ హంట్ అనే పేరు పెట్టారు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ టీజర్ విడుదలైంది. తొలి వేట మాస్ యాక్షన్స్, డైలాగ్స్ తో సాగింది.

దర్శకుడు గోపీచంద్ మలినేని, బాలయ్య పాత్రను పవర్ ఫుల్ గా డిజైన్ చేసినట్లు టీజర్ చూస్తే అర్థమౌతోంది. టీజర్‌లో బాలకృష్ణ చెప్పిన ఒక్కో డైలాగ్ మాస్‌ని కట్టిపడేస్తుంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాతో విలన్ గా నటిస్తున్నాడు. వరలక్ష్మి శరత్‌కుమార్‌ కీలక పాత్రలో కనిపించనుంది. ఇందులో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  9 Jun 2022 8:12 AM GMT
Next Story