Telugu Global
NEWS

ఇక పరీక్షలు పెట్టడం ఎందుకు? – సజ్జల

పదో తరగతి పరీక్ష ఫలితాల శాతం తగ్గిపోవడాన్ని ఏపీలో విపక్షాలు రాజకీయ కోణంలోకి తీసుకొచ్చాయి. నాడు-నేడు విఫలమైందంటూ టీడీపీ మాట్లాడుతోంది. ఈ విమర్శలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. అసలు పరీక్షలతో సంబంధం లేకుండా అందరినీ పాస్‌ చేయాలని టీడీపీ చెప్పదలుచుకుందా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో నారాయణ, చైతన్య లాంటి విద్యాసంస్థలు క్యాన్సర్‌లా పట్టుకుని.. ప్రభుత్వాన్ని ఆడిస్తూ పరీక్షలకు అర్థం లేకుండా చేశాయన్నారు. బిట్‌ పేపర్ అడ్డం పెట్టుకుని కాపీయింగ్‌ ప్రోత్సహించారని ఆరోపించారు. […]

ఇక పరీక్షలు పెట్టడం ఎందుకు? – సజ్జల
X

పదో తరగతి పరీక్ష ఫలితాల శాతం తగ్గిపోవడాన్ని ఏపీలో విపక్షాలు రాజకీయ కోణంలోకి తీసుకొచ్చాయి. నాడు-నేడు విఫలమైందంటూ టీడీపీ మాట్లాడుతోంది. ఈ విమర్శలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు.

అసలు పరీక్షలతో సంబంధం లేకుండా అందరినీ పాస్‌ చేయాలని టీడీపీ చెప్పదలుచుకుందా అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో నారాయణ, చైతన్య లాంటి విద్యాసంస్థలు క్యాన్సర్‌లా పట్టుకుని.. ప్రభుత్వాన్ని ఆడిస్తూ పరీక్షలకు అర్థం లేకుండా చేశాయన్నారు. బిట్‌ పేపర్ అడ్డం పెట్టుకుని కాపీయింగ్‌ ప్రోత్సహించారని ఆరోపించారు. భారీగా మాల్‌ప్రాక్టిస్‌ చేయించారని అందుకే ఫలితాలు 90 శాతం దాటుతూ వచ్చాయన్నారు.

ఈసారి పరీక్షలు కఠినంగా నిర్వహించడంతో ఫలితాల శాతం తగ్గిందని.. ఇది ఎలా తప్పవుతుందని ప్రశ్నించారు. పరీక్షలంటేనే మెరిట్‌ను గుర్తించేందుకు నిర్వహిస్తారని.. అలా కాకుండా అందరూ పాస్‌ అయిపోవాలంటే ఇక పరీక్షలు నిర్వహించడం ఎందుకు, ఈ సిస్టమ్ ఎందుకని సజ్జల ప్రశ్నించారు. అసలు 90 శాతం మించి ఫలితాలు ఎలా వచ్చాయో గత ప్రభుత్వమే వివరణ ఇవ్వాలన్నారు.

స్కూళ్లలో మౌలిక సదుపాయాలు పెంచేందుకు నాడు-నేడు చేపడితే.. దాని వల్లే ఫలితాలు ఇలా వచ్చాయంటున్నారనంటే అంతకంటే బుద్దిలేని మాటలు ఏమైనా ఉంటాయా అని ప్రశ్నించారు. ఈసారి కూడా మొదటి మూడు పరీక్షలు సాధారణంగా జరగడంతో చాలా మంది ఆయా సబ్జెక్టుల్లో పాస్ అయ్యారని.. ఆ తర్వాత పేపర్ లీకేజ్‌ వ్యవహారం బయటకు రావడంతో పరీక్షలను కట్టుదిట్టం చేయడంతో ఆ తర్వాత జరిగిన సబ్జెక్టుల్లో రిజల్ట్ తగ్గిందన్నారు. పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించి ఉండకపోతే ఈసారి కూడా 90 శాతం దాటి ఉండేదని.. కానీ తన ప్రభుత్వం మాస్ కాపీయింగ్ లాంటి వ్యవహారాలను ప్రోత్సహించదన్నారు.

ALSO READ: రాజమండ్రిలో హాట్ కామెంట్స్.. జయప్రద ఏపీకి ఫిక్స్ అయినట్టేనా?

First Published:  7 Jun 2022 8:42 PM GMT
Next Story