Telugu Global
NEWS

‘ప్లీజ్ అంకుల్ మా నాన్న నుంచి మా అమ్మను కాపాడండి’… పోలీసులను వేడుకున్న చిన్నారులు

”ప్లీజ్ అంకుల్ మా నాన్న నుంచి మా అమ్మను కాపాడండి…” ఓ ముగ్గురు చిన్నారులు ఈ విధంగా వేడుకున్న తీరు పోలీసుల హృదయాలను కూడా కరిగించింది. రంగారెడ్డి జిల్లా ఆదిభ‌ట్ల పోలీసు స్టేషన్ లో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే… నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పంతంగి రాజీవ్ అతని భార్య పద్మ, ముగ్గురు పిల్లలు దీపు(10), శివరామకృష్ణ (7), మరియు లక్షీకాంత్ (6)లతో కలిసి రంగారెడ్డి […]

http://teluguglobal.in/2022/06/08/please-uncle-save-our-mother-from-our-father-the-children-begged-the-police/
X

ప్లీజ్ అంకుల్ మా నాన్న నుంచి మా అమ్మను కాపాడండి…” ఓ ముగ్గురు చిన్నారులు ఈ విధంగా వేడుకున్న తీరు పోలీసుల హృదయాలను కూడా కరిగించింది. రంగారెడ్డి జిల్లా ఆదిభ‌ట్ల పోలీసు స్టేషన్ లో జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పంతంగి రాజీవ్ అతని భార్య పద్మ, ముగ్గురు పిల్లలు దీపు(10), శివరామకృష్ణ (7), మరియు లక్షీకాంత్ (6)లతో కలిసి రంగారెడ్డి జిల్లా ఆదిభ‌ట్ల TCS కాలనీలో నివాసముంటున్నారు. తాగుడుకు భానిసైన రాజీవ్ రోజూ తాగొచ్చి భార్యను చిత్ర హింసలకు గురి చేస్తూ ఉన్నాడు. అదే విధంగా నిన్న మధ్యాహ్నం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అతను పద్మను కనికరం లేకుండా కొట్టడం ప్రారంభించాడు.

అతడి అత్తమామలు అడ్డుకునేందుకు ప్రయత్నించగా, రాజీవ్ ఆ వృద్ధ దంపతులను కూడా కొట్టాడు. తల్లిపై ప్రతి రోజూ ఈ విధమైన‌ వేధింపులు భరించలేక వారి ముగ్గురు పిల్లలు ఆదిభట్ల పోలీసుస్టేషన్ కు వచ్చారు. తమ తండ్రి తల్లిని పెడుతున్న హింసల గురించి పోలీసులకు వివరించారు. తమ తల్లిని కాపాడాలని వేడుకున్నారు.

వెంటనే స్పందించిన ఇన్‌స్పెక్టర్ నరేందర్ కానిస్టేబుళ్లను రాజీవ్ ఇంటికి పంపించి అతన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. మద్యం మత్తులో ఉన్న రాజీవ్ కు కౌన్సెలింగ్ చేసి ఇంటికి పంపించారు. మరో సారి భార్యను కొట్టినట్టు తెలిస్తే తీవ్ర చర్యలు తీసుకుంటామని రాజీవ్ ను హెచ్చరించారు.

కాగా పోలీసు స్టేషన్ కు వెళ్ళి తమ తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసి తల్లిని కాపాడిన చిన్నారుల సాహసాన్ని,ఆవేదనను స్థానికులు కొనియాడుతున్నారు.

First Published:  8 Jun 2022 3:01 AM GMT
Next Story