Telugu Global
Health & Life Style

వీర్యంలో మంకీపాక్స్ వైరస్ ? అంటే ఇది లైంగికంగా సంక్రమిస్తుందా ..?

ప్రపంచదేశాల్లో మంకీపాక్స్ కేసులు తామరతంపరగా పెరుగుతున్నాయి. ఇది ప్రాణాంతకం కానప్పటికీ ఈ వైరస్ ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇప్పటివరకు ఎవరూ ఊహించని వింత ఒకటి బయట పడింది. ఈ వైరస్ మనిషి వీర్యం (సెమెన్) లో ఉంటోందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇందుకు తగినన్ని ఆధారాలు లభించనప్పటికీ మంకీపాక్స్ లైంగికంగా సంక్రమించే వ్యాధి అని ధృవీకరించలేమని, ప్రాథమికంగా ఈ అంచనాకు వచ్చామని నిపుణులు అంటున్నారు. హోమో సెక్స్యువల్ కేసుల్లో.. సెమినల్ ఫ్లూయిడ్ ద్వారా ఈ వైరస్ ట్రాన్స్ […]

మంకీపాక్స్
X

ప్రపంచదేశాల్లో మంకీపాక్స్ కేసులు తామరతంపరగా పెరుగుతున్నాయి. ఇది ప్రాణాంతకం కానప్పటికీ ఈ వైరస్ ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇప్పటివరకు ఎవరూ ఊహించని వింత ఒకటి బయట పడింది. ఈ వైరస్ మనిషి వీర్యం (సెమెన్) లో ఉంటోందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇందుకు తగినన్ని ఆధారాలు లభించనప్పటికీ మంకీపాక్స్ లైంగికంగా సంక్రమించే వ్యాధి అని ధృవీకరించలేమని, ప్రాథమికంగా ఈ అంచనాకు వచ్చామని నిపుణులు అంటున్నారు.

హోమో సెక్స్యువల్ కేసుల్లో.. సెమినల్ ఫ్లూయిడ్ ద్వారా ఈ వైరస్ ట్రాన్స్ మిట్ అవుతుందన్నది ఓ అభిప్రాయం.. కాగా ఇదే సమయంలో క్లోజ్ ఫిజికల్ కాంటాక్ట్ ద్వారా కూడా ఈ వైరస్ సోకుతుందట. వీర్యంలో మంకీపాక్స్ వైరస్ మాత్రం ఉంటుందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి.

పలు కేసుల్లో రహస్యాంగాలు లేదా పెరి-యానల్ రాషెస్ (ఆ భాగాల్లో పొక్కులు లేదా దద్దుర్లు) వంటివాటి కారణంగా లైంగిక సంపర్కం ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుండవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ లోగడ అభిప్రాయపడింది. దీనిపై నిపుణులు కొంత స్టడీ చేశారు.

ఈ మేరకు సెమెన్ లో ఈ వైరస్ జాడలున్నాయని కనుగొన్నట్టు ఈ నెల 2 న ‘యూరో సర్వేలెన్స్’ పత్రికలో ఓ అధ్యయనం ప్రచురితమైంది. ఈ పత్రిక ప్రధానంగా ఎపిడర్మియోలాజీ, ప్రివెన్షన్, కంట్రోల్ వంటివాటి అధ్యయన పత్రాలను ప్రచురిస్తుంటుంది.

ఇటలీలో స్వలింగ సంపర్కులైన సుమారు 30 ఏళ్ళ మధ్య వయస్కుల వారికి సంబంధించి నాలుగు కేసుల విషయంలో వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకుని రీసెర్చర్లు దాదాపు ఈ నిర్ధారణకు వచ్చారు. వీరందరికీ లైంగికంగా సంక్రమించిన ఇన్ఫెక్షన్స్ ఉన్నాయట.. వీరిలో ఇద్దరు హెచ్ ఐ వీ పాజిటివ్ సోకిన వ్యక్తులని వెల్లడైంది. ఈ నలుగురూ గత నెల మొదటి రెండు వారాల్లో వివిధ దేశాల్లో ప్రయాణించారని, వీరికి మంకీపాక్స్ పాజిటివ్ సోకిందని తెలియవచ్చింది.

వీరు గ్రాన్ క్యానరీ దీవులకు కూడా వెళ్లారట. వీరి రహస్య శరీర భాగాల్లో దద్దుర్ల వంటివి కనిపించాయని, వీరి సెమెన్ లో ఈ వైరస్ ఉందని నిర్ధారించారు. అయితే పూర్తిగా ఇవే ప్రధాన ఆధారాలుగా చెప్పజాలమని ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఎమర్జెన్సీ విభాగం మాజీ హెడ్ డేవిడ్ హెమెన్ అంటున్నారు. ఇది లైంగికంగా సంక్రమించిన వ్యాధి కాదని, వివిధ ట్రాన్స్ మిషన్లకు సంబంధించిన అంశాలను ఇంకా అధ్యయనం చేయవలసి ఉందని ఆయన పేర్కొన్నారు.

ఆఫ్రికన్ దేశాల్లో మంకీపాక్స్ మొదట ఒకరకంగా, ఇతర దేశాల్లో మరో రకంగా వ్యాప్తి చెందుతోందని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎకాలజీ, ఎవల్యూషనరీ బయాలజీ ప్రొఫెసర్ జేమ్స్ ఓ లాయిడ్ స్మిత్ అభిప్రాయపడ్డారు. అంటే ఈ వ్యాధి ‘ప్రవర్తన’ వేర్వేరుగా ఉంటోందని ఆయన పేర్కొన్నారు.

మంకీపాక్స్ మరో పాండమిక్ కాకపోవచ్చు

కాగా కోవిడ్ మాదిరి మంకీపాక్స్ వ్యాధి పాండమిక్ కాకపోవచ్చునని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన డా. రోసముండ్ లేవిస్ అన్నారు. ఏమైనా ముఖ్యంగా గేలు, స్వలింగ సంపర్కులైన పురుషులు జాగరూకతతో ఉండాలని. దీన్ని హెల్త్ అడ్వైజరీగా భావించాలని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వ్యాధి లక్షణాలున్న వారి నుంచి ఇది క్లోజ్ కాంటాక్ట్ లో ఉన్నవారికి సంక్రమించే అవకాశాలు ఎంతయినా ఉన్నాయని ఆయన చెప్పారు. ఇలా ఉండగా ఈ వైరస్ సెమెన్ లో కూడా ఉందా అన్న విషయంలో ఇంకా పరిశోధనలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

Next Story