Telugu Global
NEWS

టెన్త్ ఫెయిలైనవారందరికీ 10 మార్కులు కలపండి..

ఏపీలో టెన్త్ పరీక్షలు ఫెయిలైన విద్యార్థులకోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ విచిత్ర, వినూత్న ప్రదిపాదన చేశారు. ఫెయిలైనవారికి ఆయా సబ్జెక్టుల్లో 10 గ్రేస్ మార్కులు కలిపి పాస్ చేయించాలన్నారు. అంతే కాదు, పదో తరగతి ఫలితాలు సరిగా లేకపోవడానికి కారణం ప్రభుత్వమేనని విరుచుకుపడ్డారు పవన్ కల్యాణ్. ఉపాధ్యాయులకు సంబంధం లేని డ్యూటీలు వేశారని, బోధన కాకుండా ఇతర పనులు వారితో బలవంతంగా చేయించారని, అందుకే పాఠశాలల్లో విద్యా బోధన సరిగా సాగలేదని చెప్పారు పవన్. […]

Pawan Kalyan
X

ఏపీలో టెన్త్ పరీక్షలు ఫెయిలైన విద్యార్థులకోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ విచిత్ర, వినూత్న ప్రదిపాదన చేశారు. ఫెయిలైనవారికి ఆయా సబ్జెక్టుల్లో 10 గ్రేస్ మార్కులు కలిపి పాస్ చేయించాలన్నారు. అంతే కాదు, పదో తరగతి ఫలితాలు సరిగా లేకపోవడానికి కారణం ప్రభుత్వమేనని విరుచుకుపడ్డారు పవన్ కల్యాణ్.

ఉపాధ్యాయులకు సంబంధం లేని డ్యూటీలు వేశారని, బోధన కాకుండా ఇతర పనులు వారితో బలవంతంగా చేయించారని, అందుకే పాఠశాలల్లో విద్యా బోధన సరిగా సాగలేదని చెప్పారు పవన్. చివరికి ప్రభుత్వ అధినేతలు తప్పంతా తల్లిదండ్రులదేనంటున్నారని మండిపడ్డారు. ఈమేరకు జనసేనాని ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

ఫీజులు వద్దు.. మార్కులేయండి..

పదో తరగతి విద్యార్థులకు ఫెయిలైన సబ్జెక్టుల్లో పది గ్రేస్ మార్కులు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పవన్ కల్యాణ్. అలా గ్రేస్ మార్కులు ప్రకటించి మరోసారి రిజల్ట్ విడుదల చేయాలని చెప్పారు. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ వంటివి కూడా ఉచితంగా చేయాలని, విద్యార్థుల వద్ద ఫీజులు వసూలు చేయొద్దని కోరారు. సప్లిమెంటరీ పరీక్షలకు కూడా ఫీజులు కట్టించుకోవద్దని అన్నారు పవన్ కల్యాణ్.

కనీసం పిల్లలకు సరైన చదువు చెప్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దలేరా..? అని ప్రశ్నించారు పవన్. పదో తరగతి పరీక్షా ఫలితాలు చూస్తే ఆ పని కూడా ప్రభుత్వం చేయలేకపోయిందనే విషయం స్పష్టమైందని విమర్శించారు.

గ్రేస్ మార్కుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా.. ముందు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ పూర్తి చేసి, ఆ తర్వాత సప్లిమెంటరీ నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించింది. అడ్వాన్స్ సప్లిమెంటరీ రాసిన విద్యార్థుల మార్కుల జాబితాలో కంపార్ట్ మెంట్ అని మెన్షన్ చేయరు.

వారికి కూడా గ్రేడ్లు కేటాయిస్తారు. అయితే పవన్ కల్యాణ్ ప్రకటనపై మాత్రం సోషల్ మీడియాలో అప్పుడే జోకులు పేలుతున్నాయి. ఓడిపోయిన జనసేన అభ్యర్థులకు 10 ఓట్లు అదనంగా కేటాయించాలని ఎన్నికల కమిషన్ ని పవన్ కల్యాణ్ డిమాండ్ చేయాలంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

First Published:  8 Jun 2022 6:02 AM GMT
Next Story