Telugu Global
National

పేరు మార్చుకోబోతున్న శశికళ‌.. క‌లిసొచ్చేనా..?

తమిళనాడుకు ముఖ్యమంత్రి అయిపోవాలని భావించి చివరకు జైలు ఊచలు లెక్కపెట్టిన శశికళ ప్రస్తుతం పేరుమార్చుకునే ఆలోచనలో ఉన్నారట. దేంట్లోనూ కలిసి రావడం లేదని ఏ పని చేసినా వ్యతిరేక ఫలితాలువస్తున్న్శ్య‌ని భావిస్తున్న ఆమె ఓ జ్యోతిష్యుడి సలహాతో పేరుమార్చుకోబోతున్నారట. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన శశికళను ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడంలేదట. ఆమె జైలు నుండి వచ్చాక మళ్ళీ అన్నాడీఎంకేలోకి వెళ్ళాలని ప్రయత్నించారు కానీ ఆపార్టీ నేతలు ఆమెను అక్కడ అడుగుపెట్టనివ్వలేదు. ఆ పార్టీ నేతలు ఆమె ముఖం […]

పేరు మార్చుకోబోతున్న శశికళ‌.. క‌లిసొచ్చేనా..?
X

తమిళనాడుకు ముఖ్యమంత్రి అయిపోవాలని భావించి చివరకు జైలు ఊచలు లెక్కపెట్టిన శశికళ ప్రస్తుతం పేరుమార్చుకునే ఆలోచనలో ఉన్నారట. దేంట్లోనూ కలిసి రావడం లేదని ఏ పని చేసినా వ్యతిరేక ఫలితాలువస్తున్న్శ్య‌ని భావిస్తున్న ఆమె ఓ జ్యోతిష్యుడి సలహాతో పేరుమార్చుకోబోతున్నారట.

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన శశికళను ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడంలేదట. ఆమె జైలు నుండి వచ్చాక మళ్ళీ అన్నాడీఎంకేలోకి వెళ్ళాలని ప్రయత్నించారు కానీ ఆపార్టీ నేతలు ఆమెను అక్కడ అడుగుపెట్టనివ్వలేదు. ఆ పార్టీ నేతలు ఆమె ముఖం చూడడానికి కూడా ఇష్టం చూపించలేదు. దీంతో ఒంటరిగా మారిన శశికళ.. రాజకీయాల నుంచి తప్పుకుని ఆధ్యాత్మిక మార్గంలో నడవనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆధ్యాత్మిక యాత్రలు ప్రారంభించారు. పలు గుళ్లుగోపురాలను సందర్శించారు.

అయితే, మళ్లీ మనసు మారింది. మద్దతుదారులు తనను తిరిగి రాజకీయాల్లోకి రమ్మంటున్నారని, కాబట్టి మనసు మార్చుకున్నానని చెప్పారు. ఆ తర్వాత మద్దతుదారులతో సమావేశమయ్యారు. ఇన్ని చేస్తున్నా ఆమెకు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఆమె జైలుకు వెళ్లినప్పుడు అండగా ఉన్న దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే పార్టీ నేతలు కూడా పట్టించుకోవడం మానేశారు. ప్రస్తుతం ఆమె.. తన‌ భర్త నటరాజన్ సోదరులు, వదిన ఇళవరసి వారసులు, దినకరన్ సూచన మేరకు నడుచుకుంటున్నట్టు తెలుస్తోంది.

జయలలిత మాజీ సహాయకుడు పూంగుండ్రన్‌ను తనకు సహాయకుడిగా పనిచేయాలని శశికళ అడిగారని, అందుకు ఆయన నిరాకరించారని కూడా సమాచారం. అనుకున్నదేదీ సవ్యంగా సాగకపోవడం, ప్రతీ దాంట్లోనూ ఆటంకాలు ఎదురవుతుండడంతో ఇక లాభం లేదని ఇటీవల శశికళ ఓ జ్యోతిష్యుడిని కలిసినట్టు తెలుస్తోంది. ఆమె జాతకాన్ని చూసిన ఆయన.. పేరుతోపాటు ప్రస్తుతం ఉంటున్న ఇంటిని కూడా మార్చాలని సలహా ఇచ్చారని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ మార్చాలని శశికళ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

పేరు మార్పుతోనైనా కలిసొస్తుందా..!
ఇప్పటికీ ఆమె పార్టీలో పట్టుకోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమెకు అనుకూలంగా పరిస్థితి అయితే కనిపించడం లేదు. జ్యోతిష్యుల సూచన మేరకు ఆమె తన పేరును మార్చుకున్నట్లు తెలుస్తోంది. వీకే శశికళగా ఉన్న తన పేరు ముందు తన భర్త, దివంగత నటరాజన్ పేరును జత చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

అలాగే ప్రస్తుతం ఆమె నివసిస్తున్న చెన్నైలోని టి. నగర్ ఇంట్లో వాస్తు దోషం ఉండటంతో తనకు రాజకీయంగా కలిసి రావడం లేదని ఆమె భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అతి తొందరలోనే మరో ఇంటికి మారాలని ఆమె యోచిస్తున్నట్లు తెలిసింది. పేరు మార్పు తర్వాత అయినా శశికళకు రాజకీయంగా కలసి వస్తుందేమో వేచి చూడాలి.

ALSO READ: ఆర్మీలో ఇకపై కాంట్రాక్ట్ సైనికులు

First Published:  7 Jun 2022 9:17 PM GMT
Next Story