Telugu Global
National

యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఎస్సైని నడిరోడ్డు మీద చితకబాదిన జనం

ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో.. నడి రోడ్డు మీద ఓ ట్రాఫిక్ ఎస్సైని జనం చితకబాదారు. అక్కడ ట్రాఫిక్ జాం అవడంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఆ సమయంలో ట్రాఫిక్ ఎస్సై ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది.  దాంతో ఆ యువతితో సహా ఆమె కుటుంబ సభ్యులు, రోడ్డు మీద వెళ్తున్న వాహన దారులు ఆ ఎస్సైని చితకబాదారు. యువతి ఎస్సై కాలర్ పట్టుకొని రెండు చెంపలు కొట్టే వీడియో సోషల్ మీడియాలో […]

delhi traffic si
X

ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో.. నడి రోడ్డు మీద ఓ ట్రాఫిక్ ఎస్సైని జనం చితకబాదారు. అక్కడ ట్రాఫిక్ జాం అవడంతో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ఆ సమయంలో ట్రాఫిక్ ఎస్సై ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. దాంతో ఆ యువతితో సహా ఆమె కుటుంబ సభ్యులు, రోడ్డు మీద వెళ్తున్న వాహన దారులు ఆ ఎస్సైని చితకబాదారు. యువతి ఎస్సై కాలర్ పట్టుకొని రెండు చెంపలు కొట్టే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

పక్కనే ఉన్న మిగతా ట్రాఫిక్ పోలీసులు ఆ ఎస్సైని కాపాడటానికి ప్రయత్నం చేశారు. అయినా జనం ఆగ్రహం ముందు వాళ్ళేమీ చేయలేకపోయారు. అనంతరం ఆ ఎస్సైని ఆస్పత్రికి తరలించారు.

అయితే ఎస్సై వాదన మరో రకంగా ఉంది. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన మహిళను అడ్డుకోగా ఆమె తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిందని ట్రాఫిక్ ఎస్సై ఆరోపిస్తున్నారు.

కాగా ఈ ఘటనకు సంబంధించి టిగ్రి పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయ్యింది.

First Published:  8 Jun 2022 4:25 AM GMT
Next Story