Telugu Global
NEWS

40 మంది ఎమ్మెల్యేలకు టికెట్ లేనట్టే!

ఈసారి భారీగా టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కకపోవచ్చన్న వార్తలొస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్‌ తరపున పనిచేస్తున్న ఐ-ప్యాక్‌ సంస్థ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, పార్టీల పరిస్థితులపై గ్రౌండ్‌ రిపోర్టు రెడీ చేస్తోంది. ముఖ్యంగా టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది?, వారిపై ప్రజల్లో సానుకూలత ఏ స్థాయిలో ఉంది. ఒకవేళ అక్కడ సిట్టింగ్‌పై వ్యతిరేకత తీవ్రంగా ఉంటే.. ప్రత్యామ్నాయ అభ్యర్థిగా ఎవరు సరైనవారు అన్న దానిపై వివరాలను సేకరిస్తోంది. ఇప్పటికే 70 నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికలను […]

40 మంది ఎమ్మెల్యేలకు టికెట్ లేనట్టే!
X

ఈసారి భారీగా టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కకపోవచ్చన్న వార్తలొస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్‌ తరపున పనిచేస్తున్న ఐ-ప్యాక్‌ సంస్థ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే, పార్టీల పరిస్థితులపై గ్రౌండ్‌ రిపోర్టు రెడీ చేస్తోంది. ముఖ్యంగా టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది?, వారిపై ప్రజల్లో సానుకూలత ఏ స్థాయిలో ఉంది. ఒకవేళ అక్కడ సిట్టింగ్‌పై వ్యతిరేకత తీవ్రంగా ఉంటే.. ప్రత్యామ్నాయ అభ్యర్థిగా ఎవరు సరైనవారు అన్న దానిపై వివరాలను సేకరిస్తోంది.

ఇప్పటికే 70 నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికలను సీఎం కేసీఆర్‌కు ఐ-ప్యాక్ అందజేసినట్టు ఒక ప్రముఖ పత్రికలో ప్రముఖంగా కథనం ప్రచురితమైంది. మరో 40 నియోజకవర్గాల్లో పరిస్థితిపై ఈనెల 20లోగా నివేదికలు అందజేయనున్నట్టు ఆ కథనం చెబుతోంది. ఐ- ప్యాక్‌ ఇప్పటికే అందజేసిన నివేదికలతో పాటు.. తుదిదశలో ఉన్న నివేదికలను బట్టి ఈసారి దాదాపు 40 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు టికెట్లు కష్టమేనని చెబుతున్నారు.

ఒక్క టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పరిస్థితిపైనే కాకుండా.. ఆయా నియోజకవర్గాల్లో ఇతర పార్టీల పరిస్థితి ఎలా ఉంది ?, అక్కడ ఆయా పార్టీలకు బలంగా నిలుస్తున్న నేతలెవరు?, వారి శక్తిసామర్థ్యాలు ఏంటి? అన్న దానిపైనా మండల స్థాయి వరకు ఐ- ప్యాక్ నివేదికలను తయారుచేస్తోంది. ఇతర పార్టీల్లోని నేతలెవరైనా టీఆర్ఎస్‌ పట్ల సానుకూలంగా ఉన్నారా అన్న అంశాలను సేకరిస్తోంది.

మీడియాలో, సోషల్ మీడియాలో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా,అనుకూలంగా ఉన్న సంస్థలేంటి? అన్న దానిపై ఐ-ప్యాక్‌ పరిశీలన చేస్తోంది. టీఆర్‌ఎస్ వ్యతిరేక కథనాలను తిప్పికొట్టేందుకు అవసరమైన కంటెంట్‌ తయారీలోనూ పీకే టీం నిమగ్నమైంది.

ALSO READ: ఇక పరీక్షలు పెట్టడం ఎందుకు? – సజ్జల

First Published:  7 Jun 2022 9:05 PM GMT
Next Story