Telugu Global
NEWS

నాయకుడా.. విశ్లేషకుడా.. పవన్‌పై సజ్జల సెటైర్లు

సింగిల్ గా పోటీ చేయడం, టీడీపీతో వెళ్లడం, టీడీపీ-బీజేపీతో కలసి వెళ్లడం.. ఇలా 2024 ఎన్నికల పోటీపై పవన్ కల్యాణ్ తమకు తామే మూడు ఆప్షన్లు ఇచ్చుకోవడం ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. టీడీపీ, బీజేపీలు ఈ ఆప్షన్లపై పరోక్షంగా సెటైర్లు పేలుస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ తరపున సజ్జల రామకృష్ణారెడ్డి, పవన్ పై సెటైర్లు వేశారు. తాను రాజకీయ నాయకుడిని అనే విషయాన్ని పవన్ మరచిపోయారని, ఆయన కేవలం రాజకీయ విశ్లేషకుడిలాగా మాట్లాడుతున్నారని […]

నాయకుడా.. విశ్లేషకుడా.. పవన్‌పై సజ్జల సెటైర్లు
X

సింగిల్ గా పోటీ చేయడం, టీడీపీతో వెళ్లడం, టీడీపీ-బీజేపీతో కలసి వెళ్లడం.. ఇలా 2024 ఎన్నికల పోటీపై పవన్ కల్యాణ్ తమకు తామే మూడు ఆప్షన్లు ఇచ్చుకోవడం ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. టీడీపీ, బీజేపీలు ఈ ఆప్షన్లపై పరోక్షంగా సెటైర్లు పేలుస్తున్నాయి. ఇప్పుడు వైసీపీ తరపున సజ్జల రామకృష్ణారెడ్డి, పవన్ పై సెటైర్లు వేశారు. తాను రాజకీయ నాయకుడిని అనే విషయాన్ని పవన్ మరచిపోయారని, ఆయన కేవలం రాజకీయ విశ్లేషకుడిలాగా మాట్లాడుతున్నారని విమర్శించారు.

రాజకీయాలపై సీరియస్‌ గా ఉన్నవాళ్లు ఒంటరిగానే పోటీ చేయాలని భావిస్తారని.. కానీ విశ్లేషకుడి లాగా పవన్ కల్యాణ్ ఆప్షన్లు మాత్రమే చెప్పారని అన్నారు సజ్జల. జనసేన తన పార్టీయేనని పవన్ కల్యాణ్ మరచిపోయినట్టున్నారని చురకలంటించారు సజ్జల. బీజేపీ కలసి వస్తుందో లేదో కానీ పవన్ కల్యాణ్ మాత్రం టీడీపీతో వెళ్లడం ఖాయమని తేల్చేశారు సజ్జల. చంద్రబాబు గేమ్ ప్లాన్ ప్రకారమే పవన్ కల్యాణ్ మూడు ఆప్షన్ల వ్యాఖ్యలు చేశారని అన్నారు. అయితే టీడీపీ నేతలే పవన్ పై విమర్శలు చేస్తున్నారని, ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానంటోందని వెటకారంగా మాట్లాడుతున్నారని గుర్తు చేశారు.

నడ్డా వ్యాఖ్యలు సరికావు..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యల్లో డొల్లతనం బయట పడిందని విమర్శించారు సజ్జల రామకృష్ణారెడ్డి. పథకాల్లో కేంద్రం వాటా ఎంత..? రాష్ట్రం వాటా ఎంత..? అనేది తెలియకుండా నడ్డా మాట్లాడటం హాస్యాస్పదం అని అన్నారు స్జజల.

పరీక్షలు పరీక్షల లాగే నిర్వహించాం..
పదో తరగతి ఫలితాలపై ప్రతిపక్షాల విమర్శలను కూడా తిప్పికొట్టారు సజ్జల రామకృష్ణారెడ్డి. సీరియస్‌గా పరీక్షలు ఎలా నిర్వహించాలో అలాగే నిర్వహించామని, ఎక్కువ మంది పాస్ కాకపోవడానికి అదే కారణం అని అన్నారు సజ్జల. కొవిడ్ ప్రభావం కూడా కొంత ఉందని చెప్పారు. ఫలితాలపై టీడీపీ విమర్శలు చేయడం అర్థరహితమని అన్నారు. పరీక్షలు పెట్టాలా, లేక ఆల్ పాస్ అనాలా.. అనేది టీడీపీయే చెప్పాలన్నారు. నారాయణ, చైతన్య వంటి విద్యాసంస్థలు టీడీపీ హయాంలో ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తూ వచ్చాయని.. అందుకే అప్పట్లో 90 శాతానికి పైగా ఉత్తీర్ణత వచ్చిందన్నారు. కాపీ కొట్టడానికి అవకాశం ఉండే బిట్ పేపర్ లేకపోవడం కూడా పాస్ పర్సంటేజ్ తగ్గడానికి ఒక కారణం అని చెప్పారు సజ్జల.

First Published:  7 Jun 2022 6:46 AM GMT
Next Story