Telugu Global
MOVIE UPDATES

నయనతార కోసం భారీ సెక్యూరిటీ

మరో 3 రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెడుతోంది నయనతార. ఏడేళ్లుగా ప్రేమిస్తున్న విఘ్నేష్ శివన్ ను పెళ్లాడబోతోంది. మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో ఈనెల 9న వీళ్ల పెళ్లి జరగనుంది. ఈ పెళ్లికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అదే స్థాయిలో సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. నయనతార-విఘ్నేష్ పెళ్లికి చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరుకాబోతున్నారు. ఇండస్ట్రీ నుంచి అజిత్, రజనీకాంత్, విజయ్ లాంటి హీరోలు ఈ పెళ్లికి వస్తున్నారు. ఇక రాజకీయాల నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి […]

నయనతార కోసం భారీ సెక్యూరిటీ
X

మరో 3 రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెడుతోంది నయనతార. ఏడేళ్లుగా ప్రేమిస్తున్న విఘ్నేష్ శివన్ ను పెళ్లాడబోతోంది. మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో ఈనెల 9న వీళ్ల పెళ్లి జరగనుంది. ఈ పెళ్లికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అదే స్థాయిలో సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేస్తున్నారు.

నయనతార-విఘ్నేష్ పెళ్లికి చాలామంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరుకాబోతున్నారు. ఇండస్ట్రీ నుంచి అజిత్, రజనీకాంత్, విజయ్ లాంటి హీరోలు ఈ పెళ్లికి వస్తున్నారు. ఇక రాజకీయాల నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ పెళ్లికి హాజరయ్యే అవకాశం ఉంది. నయన్-విఘ్నేష్ స్వయంగా వెళ్లి స్టాలిన్ ను పెళ్లికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

అందుకే ఈ పెళ్లి కోసం భారీగా సెక్యూరిటీ ఏర్పాటుచేశారు. ఆహ్వాన పత్రికలోనే క్యూఆర్ కోడ్ ఏర్పాటుచేశారు. సదరు కుటుంబం నుంచి పెళ్లికి ఎంతమంది వస్తున్నారనేది ఆ కోడ్ లో నిక్షిప్తం అయి ఉంటుంది. వివాహ వేదిక వద్ద ఆ కోడ్ ను స్కాన్ చేసి, ఎవరి పేరు మీద ఎంత మంది వస్తున్నారో లెక్కిస్తారు. ఒక్కరు అదనంగా వచ్చినా లోపలకు అనుమతించరు.

అంతేకాకుండా.. పెళ్లికి ఎవరొస్తున్నారు, సంగీత్ కు ఎవరొస్తున్నారనే అంశంపై కూడా లెక్క తేల్చారు. నయన్-విఘ్నేష్ కామన్ ఫ్రెండ్స్ కొందరు సంగీత్ నుంచే పెళ్లి వేడుకలో పాల్గొంటారు. ఇలాంటి వాళ్లకు డ్రెస్ కోడ్ కూడా పెట్టారు. పెళ్లి తర్వాత చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటుచేసింది ఈ జంట.

First Published:  7 Jun 2022 3:59 AM GMT
Next Story