Telugu Global
MOVIE UPDATES

మాటే మంత్రం అంటున్న మేఘా ఆకాష్

రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న సినిమాకు “మాటే మంత్రము” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రాహుల్ విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ జరిగింది. ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందించగా…అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం […]

మాటే మంత్రం అంటున్న మేఘా ఆకాష్
X

రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ జంటగా నటిస్తున్న సినిమాకు “మాటే మంత్రము” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. రాహుల్ విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ టైటిల్ అనౌన్స్ మెంట్ జరిగింది. ఈ చిత్రాన్ని మేఘ ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు. కోట ఫిలిం ఫ్యాక్టరీ & ట్రిప్పి ఫ్లిక్స్ స్టూడియోస్ బ్యానర్స్ పై సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సుశాంత్ రెడ్డి కథను అందించగా…అభిమన్యు బద్ది దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలోనే టీజర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తారు.

ఈ సినిమా తొలి షెడ్యూల్ హైదరాబాద్ లో, రెండో షెడ్యూల్ గోవాలో జరిగింది. గోవా బ్యాక్ డ్రాప్ లో జరిగే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మేఘా ఆకాష్ కెరీర్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్తుందని అనుకుంటున్నారు.

ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, అర్జున్ కల్యాణ్ కీలక పాత్రలు పోషించారు. హరి గౌర ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  7 Jun 2022 3:50 AM GMT
Next Story