Telugu Global
NEWS

జూబ్లీ హిల్స్ అత్యాచారం: డిజీపీ, ఛీఫ్ సెక్రటరీలకు మహిళా కమిషన్ నోటీసులు

హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కొందరు రాజకీయ నాయకుల పిల్లలను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. బీజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఏకంగా కొన్ని ఫోటోలు రిలీజ్ చేసి ఒక ఎమ్మెల్యే కుమారుడు ఈ సంఘటన‌లో నిందితుడని ఆరోపించారు. మరో వైపు అత్యాచార ఘటన‌పై తెలంగాణ పోలీసులు సరి అయిన‌ చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తూ ఆ పార్టీ నేతలు […]

jubilee-hills-rape-case-womens-commission-notices-to-dgp-chief-secretaries
X

హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ అమ్నీషియా పబ్ గ్యాంగ్ రేప్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కొందరు రాజకీయ నాయకుల పిల్లలను కాపాడేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. బీజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఏకంగా కొన్ని ఫోటోలు రిలీజ్ చేసి ఒక ఎమ్మెల్యే కుమారుడు ఈ సంఘటన‌లో నిందితుడని ఆరోపించారు.

మరో వైపు అత్యాచార ఘటన‌పై తెలంగాణ పోలీసులు సరి అయిన‌ చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తూ ఆ పార్టీ నేతలు జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించింది. ఈ అత్యాచార ఘటన‌కు సంబంధించి పూర్తి వివరాలను అందించాలంటూ తెలంగాణ ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసింది.

కాగా సికిందరాబాద్ కార్ఖానా పరిథిలో జరిగిన మరో మైనర్ అత్యాచారం ఘటన‌పై కూడా మహిళా కమిషన్ విచారణ జరుపుతున్నట్టు సమాచారం.

ఇక అమ్నీషియా పబ్ అత్యాచారంకేసులో పోలీసులు ఇప్పటి వరకు 5గురు నిందితులను అరెస్టు చేశారు.

First Published:  7 Jun 2022 5:54 AM GMT
Next Story