Telugu Global
MOVIE UPDATES

ఎఫ్ 3: 10 రోజుల్లో 110 కోట్లు

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫన్ ఫ్రాంచైజీ ‘ఎఫ్ 3’ భారీ వసూళ్ళతో దూసుకెళ్తోంది. సినిమాలో హిలేరియస్ కామెడీ వర్కౌట్ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ క్యూ కట్టి డీసెంట్ కలెక్షన్స్ అందించారు. 10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు 110 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అలా వంద కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా కూడా చేరింది. నైజాం, కృష్ణా , గుంటూరు, […]

ఎఫ్ 3: 10 రోజుల్లో 110 కోట్లు
X

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఫన్ ఫ్రాంచైజీ ‘ఎఫ్ 3’ భారీ వసూళ్ళతో దూసుకెళ్తోంది. సినిమాలో హిలేరియస్ కామెడీ వర్కౌట్ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ క్యూ కట్టి డీసెంట్ కలెక్షన్స్ అందించారు.

10 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు 110 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. అలా వంద కోట్ల క్లబ్ లోకి ఈ సినిమా కూడా చేరింది. నైజాం, కృష్ణా , గుంటూరు, వైజాగ్ ఏరియాల్లో నిర్మాతలు దిల్ రాజు , శిరీష్ ఈ సినిమాను సొంతంగా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. వాళ్లు మంచి లాభాలు అందుకున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లో మిగతా ఏరియాల్లో కూడా దాదాపు 80 శాతం రికవరీ అయ్యింది. త్వరలోనే ఆ ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వనుంది. వీకెండ్ తో పాటు వీక్ డేస్ లో కూడా సినిమా మంచి వసూళ్ళు అందుకుంటోంది.

వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహ్రీన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఎఫ్ 3 భారీ సక్సెస్ సాధించడంతో ఎఫ్4 ని ఎనౌన్స్ చేశారు మేకర్స్. బాలయ్య సినిమాతో పాటు మరో సినిమా కంప్లీట్ చేసి ఎఫ్4 మొదలు పెడతాడు అనిల్ రావిపూడి.

First Published:  7 Jun 2022 3:55 AM GMT
Next Story