Telugu Global
National

కర్నాటకలో పెరుగుతున్న కేసులు.. నిక్కర్ల రాజకీయంలో నేతలు..

కర్నాటకలో కరోనా కేసులు మూడు రోజులుగా పెరుగుతున్నాయి. కేసులు పెరగడంతోపాటు, ఆదివారం ఒక మరణం కూడా సంభవించడంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మూడు రోజులుగా సగటున రోజువారీ కేసులు 300 మార్కు దాటాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రజలెవరూ అనవసర భయాందోళనలకు గురికావొద్దని విజ్ఞప్తి చేశారు సీఎం బసవరాజ్ బొమ్మై. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్ […]

కర్నాటకలో పెరుగుతున్న కేసులు.. నిక్కర్ల రాజకీయంలో నేతలు..
X

కర్నాటకలో కరోనా కేసులు మూడు రోజులుగా పెరుగుతున్నాయి. కేసులు పెరగడంతోపాటు, ఆదివారం ఒక మరణం కూడా సంభవించడంతో ప్రజలు ఆందోళన పడుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు పరిసర ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మూడు రోజులుగా సగటున రోజువారీ కేసులు 300 మార్కు దాటాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రజలెవరూ అనవసర భయాందోళనలకు గురికావొద్దని విజ్ఞప్తి చేశారు సీఎం బసవరాజ్ బొమ్మై. ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కొవిడ్ సెకండ్‌ వేవ్‌ సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు పరిహారం చెల్లించామని, ఆర్థిక సాయం అందనివారు స్థానిక అధికారుల్ని సంప్రదించాలని సూచించారు సీఎం.

ఇక్కడికి ఇది చాలా సీరియస్ విషయం. ప్రభుత్వంతోపాటు ప్రతిపక్షం కూడా సీరియస్ గా దృష్టి సారించాల్సిన విషయం. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. కానీ కర్నాటకలో రాజకీయాలు ఇప్పుడు నిక్కర్ల చుట్టూ తిరుగుతున్నాయి. అదేనండి ఆర్ఎస్ఎస్ నిక్కర్లు. ఆ నిక్కర్లను కాంగ్రెస్ వాళ్లు తగలబెట్టడం, ప్రతిగా.. కాంగ్రెస్ కార్యాలయాలకు బస్తాలకొద్దీ ఖాకీ నిక్కర్లను బీజేపీ నేతలు పంపించడం హాట్ టాపిక్ గా మారింది.

విద్యను కాషాయీకరణం చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ విద్యార్థి విభాగం.. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) సభ్యులు కర్నాటకలో ఇటీవల ఆందోళన చేపట్టారు. విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్ ఇంటి ముందు ఖాకీ నిక్కర్లను కాల్చి నిరసన తెలియజేశారు. దీన్ని సమర్థించిన మాజీ సీఎం సిద్ధరామయ్య.. NSUI నేతలు కేవలం పోలీసుల ముందు చెడ్డీలను కాల్చారని, కానీ తాము రాష్ట్రంలో ఎక్కడైనా వాటిని కాలుస్తామని చెప్పారు. కాంగ్రెస్ శ్రేణులు ఆర్ఎస్ఎస్ కి వ్యతిరేకంగా చెడ్డీలను పోగేసి తగలబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో ఈ వివాదం మరింత రాజుకుంది.

సిద్ధరామయ్య చెడ్డీలు కాల్చాలనుకుంటే.. ఆయన ఇంట్లోనే వాటిని తగలబెట్టాలని, ఒకవేళ ఆయన ఇంట్లో అవి లేకపోతే తామే పంపిస్తామని సలహా ఇచ్చారు బీజేపీ నేత నారాయణ స్వామి. ఆయన పిలుపునివ్వడంతో బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు సిద్ధరామయ్య ఇంటికి చెడ్డీల బస్తాలు పార్శిల్ చేసి పంపిస్తున్నారు. కర్నాటకలోని కాంగ్రెస్ కార్యాలయాలకు కూడా ఇప్పుడు చెడ్డీ బస్తాలు వస్తున్నాయి.

ఓవైపు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుంటే.. మరోవైపు నాయకులు ఇలా చెడ్డీ వార్ తో తలపడుతున్నారు. అర్థంపర్థం లేని విధంగా నాయకులు పిలుపునివ్వడం, వాటిని కార్యకర్తలు తూచా తప్పకుండా అమలు చేయడం.. ఇప్పుడు దేశవ్యాప్తంగా కర్నాటక చెడ్డీ వివాదం హాట్ టాపిక్ గా మారింది.

First Published:  6 Jun 2022 8:54 PM GMT
Next Story