Telugu Global
National

ఆర్మీలో ఇకపై కాంట్రాక్ట్ సైనికులు

‘కాంట్రాక్ట్ సైనికులు‘.. అవును మీరు కరెక్ట్ గానే చదివారు. కాంట్రాక్ట్ టీచర్లు, కాంట్రాక్టు లెక్చరర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు తెలుసు. కానీ ఈ కాంట్రాక్ట్ సైనికులేంటని ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్మీ కలిగిన దేశాల్లో ఇండియా 2వ స్థానంలో ఉంది. నిరుడు వెల్లడించిన గణాంకాల ప్రకారం దాదాపు 15 లక్షల మంది సైనికులు ఆర్మీలో ఉన్నారు. ప్రతీ ఏడాది కొత్త వాళ్లు వస్తుండగా.. రిటైర్ అయ్యే వాళ్లు అవుతూనే ఉన్నారు. ఆర్మీ నుంచి రిటైర్ అవుతున్న ఉద్యోగుల పెన్షన్ల […]

ఆర్మీలో ఇకపై కాంట్రాక్ట్ సైనికులు
X

కాంట్రాక్ట్ సైనికులు‘.. అవును మీరు కరెక్ట్ గానే చదివారు. కాంట్రాక్ట్ టీచర్లు, కాంట్రాక్టు లెక్చరర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు తెలుసు. కానీ ఈ కాంట్రాక్ట్ సైనికులేంటని ఆశ్చర్యపోతున్నారు. ప్రపంచంలో అతిపెద్ద ఆర్మీ కలిగిన దేశాల్లో ఇండియా 2వ స్థానంలో ఉంది. నిరుడు వెల్లడించిన గణాంకాల ప్రకారం దాదాపు 15 లక్షల మంది సైనికులు ఆర్మీలో ఉన్నారు. ప్రతీ ఏడాది కొత్త వాళ్లు వస్తుండగా.. రిటైర్ అయ్యే వాళ్లు అవుతూనే ఉన్నారు. ఆర్మీ నుంచి రిటైర్ అవుతున్న ఉద్యోగుల పెన్షన్ల కోసం ఏడాదికి రూ. 1.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది.

భారత ప్రభుత్వం త్రివిద‌ దళాల కోసం రూ. 5.25 లక్షల కోట్ల‌ బడ్జెట్ ఈ ఏడాది కేటాయించింది. ఇందులో నాలుగో వంతు పెన్షన్ల చెల్లింపునకే సరిపోతోంది. అందుకే ఎలాంటి పెన్షన్లు, ప్రమోషన్ల గొడవ లేని ఒక స్కీమ్‌ను తెరపైకి తీసుకొని వచ్చింది. టూర్ ఆఫ్ డ్యూటీ (టీఓడీ) అనే పథకం ద్వారా కాంట్రాక్టు పద్దతిలో సైనికులను నియమించుకుంటారు. అగ్నిపథ్ యోజన ఆర్మీ భారతి పేరుతో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సులో రిక్రూట్ చేసుకునే సైనికులను అగ్నివీర్ అని పిలుస్తారు.

ఈ పథకం ద్వారా రిక్రూట్ చేసుకునే వారు 18 నుంచి 21 ఏళ్ల వయసు, అండర్ గ్రాడ్యుయేట్ అయి ఉంటే చాలు. పూర్తిగా కాంట్రాక్ట్ పద్దతిలో చేరే వీళ్లకు ప్రమోషన్లు ఉండవు. సాధారణ సైనికుడికి అందేంత జీతమే వస్తుంది. మొత్తం నాలుగేళ్లు సర్వీసులో ఉండాలి. అందులో 6 నెలలు శిక్షణ ఉంటుంది. ఈ పథకం ద్వారా చేరిన వాళ్లలో 25 శాతం మందిని మాత్రమే పర్మనెంట్ చేసే అవకాశం ఉంటుంది.

కాగా, ఈ నిర్ణయంపై చాలా మంది ఆర్మీ ఆఫీసర్లు మండిపడుతున్నారు. ఒక మామూలు సైనికుడికి నాలుగేళ్ల పాటు శిక్షణ ఉంటుందని, ఆ తర్వాత మరో ఏడాది పాటు ఆయా యూనిట్లలో ట్రైనింగ్ ఇస్తారని అంటున్నారు. కానీ కాంట్రాక్టు సైనికులకు కేవలం ఆరు నెలలు శిక్షణ ఇచ్చి సైన్యంలో చేరిస్తే లాభం లేదని అంటున్నారు. సరైన శిక్షణ లేని వాళ్ల వలన.. యుద్ధ‌ రంగంలో పక్కన ఉన్న సైనికులకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయంటున్నారు.

మరోవైపు ఇలా నాలుగేళ్లు ఆర్మీలో పని చేసి బయటకు వెళ్లిన వాళ్లు సంఘవిద్రోహ శక్తులుగా మారితే ఎవరిది బాధ్యతని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవడం మనకు మంచిదని వారు సూచిస్తున్నారు.

First Published:  7 Jun 2022 10:00 AM GMT
Next Story