Telugu Global
CRIME

భోపాల్ లో దారుణం.. టికెట్టు లేని ప్రయాణికురాలిని రేప్ చేసిన టీసీ..

టికెట్ లేని మహిళా ప్రయాణికురాలు ఒంటరిగా కనపడేసరికి ఆ టికెట్ కలెక్టర్ (టీసీ)లో మానవ మృగం నిద్రలేచింది. ఫైన్ కట్టాల్సిందేనని భయపెట్టాడు. డబ్బులు లేవనే సరికి పోలీస్ కేసు పెడతానంటూ బెదిరించాడు. చివరకు మాయమాటలు చెప్పి, మభ్యపెట్టాడు. తన పై అధికారిని కలిసి మేటర్ సెటిల్ చేసుకోవాలంటూ రైల్వే క్వార్టర్స్ వైపు తీసుకెళ్లాడు. ఎవరూ లేని ప్రదేశంలో ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘోరం ఎవరికి చెప్పుకోవాలో తెలియక, చివరకు ఇంటికి చేరుకున్న ఆ మహిళ, భర్త […]

Rape
X

టికెట్ లేని మహిళా ప్రయాణికురాలు ఒంటరిగా కనపడేసరికి ఆ టికెట్ కలెక్టర్ (టీసీ)లో మానవ మృగం నిద్రలేచింది. ఫైన్ కట్టాల్సిందేనని భయపెట్టాడు. డబ్బులు లేవనే సరికి పోలీస్ కేసు పెడతానంటూ బెదిరించాడు. చివరకు మాయమాటలు చెప్పి, మభ్యపెట్టాడు. తన పై అధికారిని కలిసి మేటర్ సెటిల్ చేసుకోవాలంటూ రైల్వే క్వార్టర్స్ వైపు తీసుకెళ్లాడు. ఎవరూ లేని ప్రదేశంలో ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘోరం ఎవరికి చెప్పుకోవాలో తెలియక, చివరకు ఇంటికి చేరుకున్న ఆ మహిళ, భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘోరం మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో జరిగింది. టీసీ రాజులాల్ మీనా ఇప్పుడు జీఆర్పీ కస్టడీలో ఉన్నాడు.

బాధిత మహిళ అత్తగారి ఇంటికి వెళ్లేందుకు గుణ స్టేషన్ లో సాగర్ వైపు వెళ్లే భాగల్ పూర్ ఎక్స్ ప్రెస్ ఎక్కింది. ఆమె భర్త టికెట్ తీసిచ్చేందుకు స్టేషన్ కు వచ్చాడు. ఆయన టికెట్ తీసుకొచ్చేలోపు రైలు బయలుదేరింది. భర్త సమయానికి రాకపోవడంతో ఆమె టికెట్ లేకుండానే ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించి సాగర్ రైల్వే స్టేషన్లో దిగింది. అక్కడ ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్ పై టీసీ రాజులాల్ మీనా ఉన్నాడు. రైలు దిగిన మహిళను చూసి టికెట్ అడిగాడు. తన భర్త టికెట్ తెచ్చేలోపు ట్రైన్ కదిలిందని ఆమె వివరించి చెప్పింది. కానీ మీనా వదిలిపెట్టలేదు. జరిమానా కట్టాలని భయపెట్టాడు. ఆమె నిస్సహాయతను గమనించి, దురాలోచనతో ఆమెను రైల్వే క్వార్టర్స్ కి తీసుకెళ్లాడు.

తన పై అధికారి వద్ద హాజరు కావాలని చెప్పి ఆమెను రైల్వే క్వార్టర్స్ కి తీసుకెళ్లిన రాజులాల్ మీనా.. అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రివేళ కావడంతో ఆమెకు సహాయం చేసేందుకు ఎవరూ రాలేదు. బాధితురాలు అతనిబారినుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లింది. ఆ తర్వాతి రోజు భర్తకి విషయం చెప్పింది. భర్తతో కలసి సాగర్ కంట్ పోలీస్ స్టేషన్లో టీసీపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా గవర్నమెంట్ రైల్వే పోలీసులు టీసీ రాజులాల్ మీనాను అదుపులోకి తీసుకున్నారు.

First Published:  7 Jun 2022 2:32 AM GMT
Next Story