Telugu Global
NEWS

అడ్డంగా ఉంటే సరిపోదు నడ్డా..- పేర్నినాని ఫైర్

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఏపీ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పచ్చి అబద్దాలు చెప్పేందుకు ఢిల్లీ నుంచి ఎగేసుకువచ్చారని విమర్శించారు. రాజమండ్రికి కూతవేటు దూరంలో ఉన్న పోలవరం గురించి ఎందుకు మాట్లాడడం లేదు..?, ఆ ప్రాజెక్టుకు నిధులు సకాలంలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఏపీకి 8 లక్షల కోట్ల అప్పు ఉందంటున్నారని.. కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతూ రాష్ట్ర అప్పు ఎంత ఉందో తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో బీజేపీ […]

అడ్డంగా ఉంటే సరిపోదు నడ్డా..- పేర్నినాని ఫైర్
X

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఏపీ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పచ్చి అబద్దాలు చెప్పేందుకు ఢిల్లీ నుంచి ఎగేసుకువచ్చారని విమర్శించారు. రాజమండ్రికి కూతవేటు దూరంలో ఉన్న పోలవరం గురించి ఎందుకు మాట్లాడడం లేదు..?, ఆ ప్రాజెక్టుకు నిధులు సకాలంలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఏపీకి 8 లక్షల కోట్ల అప్పు ఉందంటున్నారని.. కేంద్ర ప్రభుత్వాన్ని నడుపుతూ రాష్ట్ర అప్పు ఎంత ఉందో తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో బీజేపీ ఉందని విమర్శించారు.

ఒకవేళ తాము హద్దులు దాటి అప్పు చేస్తుంటే మీ కేంద్ర ప్రభుత్వం, మీ ఆర్థిక మంత్రి, ఆర్‌బీఐ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. విచ్చలవిడిగా తాము అప్పులు చేస్తుంటే కళ్లు మూసుకున్నారా అని ప్రశ్నించారు. బీజేపీకి అధికారం అప్పగించినప్పుడు రూ.53 లక్షల కోట్ల అప్పు ఉంటే.. ఇప్పుడు దేశ అప్పును రూ.130 లక్షల కోట్లకు తీసుకెళ్లింది మీరు కాదా అని ప్రశ్నించారు.

కులం, మతం పేరుతో తగువలాటలు తప్ప ఏం సాధించారని నిలదీశారు. బీజేపీ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలిచ్చిందో చెప్పాలన్నారు. ప్రతి అకౌంట్‌లో రూ.15 లక్షలు వేస్తామన్న వారు ఎంతమందికి డబ్బులు పంపారని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా రాష్ట్రాలు అప్పులు తెచ్చే పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రశాంతంగా ఉన్న ఏపీలోనూ మత చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించని రోజంటూ..? ఉందా అని ఫైర్ అయ్యారు.

పర్యటనకు విమానం, కార్లు పెట్టిన వాడు చెవిలో ఏది చెబితే అదే బహిరంగ వేదికల మీద మాట్లాడుతారా అని నడ్డాను ప్రశ్నించారు. అడ్డంగా ఉంటే సరిపోదు నడ్డా గారు మాట్లాడితే నిజాయితీ ఉండాలని పేర్నినాని హితవు పలికారు. ఎవరి చెవితో పూలు పెట్టేందుకు ఢిల్లీ నుంచి ఎగేసుకుంటూ వచ్చారని మండిపడ్డారు. దేశ ప్రజల కర్మకొద్దీ వీరంతా దేశనాయకులయ్యారని పేర్నినాని విమర్శించారు. ఆరోగ్యశ్రీ మీదా? వైఎస్‌ఆర్‌ 108 అంబులెన్స్‌లు తెస్తే కాపీ కొట్టి గుజరాత్‌లో పెట్టుకున్న ప్రభుత్వం మీదని ఫైర్ అయ్యారు.

ఆయూష్మాన్‌ భారత్‌ కింద కేంద్రం ఇచ్చింది రూ. 230 కోట్లని.. కానీ ఆరోగ్యశ్రీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది రూ.2,400 కోట్లు అని వివరించారు. కేంద్రం ఇచ్చే నిధులతో కట్టుకట్టే కాటన్‌ కూడా రాదన్నారు. ఆయూష్మాన్‌ భారత్‌ నిబంధనలకు పాటిస్తే ఏపీలో ఒక్కరికీ వైద్యం అందించలేమని నాని వ్యాఖ్యానించారు.

First Published:  7 Jun 2022 10:27 AM GMT
Next Story