Telugu Global
National

‘నెహ్రూకు ఈడీ సమన్లు జారీ చేస్తే గానీ బీజేపీకి సంత్రుప్తి ఉండదు’

మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు ​​జారీ చేస్తే గానీ బీజేపీకి సంత్రుప్తిగా ఉండదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలకు ఈడీ ఇటీవల సమన్లు ​​జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సంజయ్ రౌత్ శివసేన అధికార పత్రిక సామ్నాలో రాసిన వ్యాసంలో విమర్షలు గుప్పించారు. నేషనల్ హెరాల్డ్ స్వాతంత్య్ర పోరాట సమయంలో […]

నెహ్రూ
X

మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు ​​జారీ చేస్తే గానీ బీజేపీకి సంత్రుప్తిగా ఉండదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలకు ఈడీ ఇటీవల సమన్లు ​​జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సంజయ్ రౌత్ శివసేన అధికార పత్రిక సామ్నాలో రాసిన వ్యాసంలో విమర్షలు గుప్పించారు. నేషనల్ హెరాల్డ్ స్వాతంత్య్ర పోరాట సమయంలో నెహ్రూ సృష్టించిన ఆయుధం లాంటిదని, ఆస్తి కాదని రౌత్ పేర్కొన్నారు.

ప్రస్తుత రాజకీయాల్లో వ్యాపారులు ఈ విషయాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారు? అని రౌత్ బీజేపీని ఉద్దేశించి ప్రశ్నించారు.

నెహ్రూ ప్రారంభించిన నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక చాలా కాలం క్రితమే రాజకీయ ప్రాముఖ్యతను కోల్పోయిందని, అయితే దానిపై రాజకీయాలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయని రౌత్ పేర్కొన్నారు.

“1937లో జవహర్‌లాల్ నెహ్రూ ఈ వార్తాపత్రికను ప్రారంభించినప్పుడు, మహాత్మా గాంధీ, వల్లభ్‌భాయ్ పటేల్, నెహ్రూ లు దీనికి మూల స్తంభాలు. ఈ పత్రికలో నిజాలు రాస్తున్నందుకు బ్రిటిష్ వారు భయపడి 1942 నుండి 45 మధ్య నిషేధించారు” అని రౌత్ చెప్పారు.

ఈ వార్తాపత్రిక లాభాల కోసం ప్రారంభించబడలేదు. నేషనల్ హెరాల్డ్ నష్టాలను చవిచూస్తున్నప్పుడు, నెహ్రూ తన ఇంటిని కూడా అమ్మడానికి ముందుకొచ్చారని, నెహ్రూ కాలంలో నేషనల్ హెరాల్డ్‌తో అనుబంధం ఉన్న పిడి టాండన్ పుస్తకంలోని ఉదంతాలను ఉటంకిస్తూ శివసేన నాయకుడు చెప్పారు.

సామ్నా మరియు నేషనల్ హెరాల్డ్ మధ్య సారూప్యతలను పేర్కొన్నారు రౌత్. రెండు వార్తాపత్రికలు ఆస్తులు కాదని, ఆలోచనలు, భావజాల వాహకాలు అని అన్నారు. నేషనల్ హెరాల్డ్ అంశంపై రాహుల్ గాంధీతో పాటు కొందరు కాంగ్రెస్ సభ్యులతో చర్చించినట్లు రౌత్ తెలిపారు.

“ఈ కేసులో నెహ్రూను కూడా పిలవడానికి ఈడీ అతని స్మారక చిహ్నంపై నోటీసును అతికించినా ఆశ్చర్యం లేదు” అని ఆయన పేర్కొన్నారు.

పిఎం కేర్స్ ఫండ్‌పై కూడా అనేక ప్రశ్నలు వచ్చాయని, సంఘ్ పరివార్ ఆధ్వర్యంలోని అనేక సంస్థలు కొన్ని ఆర్థిక లావాదేవీలను నిర్వహించాయని రౌత్ చెప్పారు.

“ఈ కేసును ఇంత వరకు సాగదీయాల్సిన అవసరం లేదు. నెహ్రూ ప్రారంభించిన వారసత్వం బతికి బట్టకట్టేందుకు కాంగ్రెస్ కొన్ని ఆర్థిక లావాదేవీలు చేసి ఉండవచ్చు. సంఘ్ పరివార్ ఆధ్వర్యంలోని అనేక సంస్థలు ఇటువంటి లావాదేవీలు జరుపుతున్నాయి. పీఎం కేర్స్ ఫండ్‌పై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. బీజేపీ ఖజానాలో కోట్లాది రూపాయలు జమ అయ్యాయి’’ అని ఆరోపించారు సంజయ్ రౌత్.

First Published:  6 Jun 2022 6:00 AM GMT
Next Story