Telugu Global

‘బీజేపీ మతోన్మాద వ్యాఖ్యలకు దేశం ఎందుకు క్షమాపణ చెప్పాలి ?’

బిజెపి మతోన్మాదులు ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే అంతర్జాతీయ సమాజానికి భారతదేశం ఎందుకు క్షమాపణలు చెప్పాలి? అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధానిని ప్రశ్నించారు. బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు భారత ప్రభుత్వం అంతర్జాతీయ సమాజానికి క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో కేటీఆర్ ఈ విధంగా వరస ట్వీట్లు చేశారు. ఆయన తన ట్వీట్లను నరేంద్ర మోడీకి ట్యాగ్ చేశారు. ఆయన ఇంకా తన ట్వీట్ లో…. ”క్షమాపణ చెప్పాల్సింది భారత దేశం […]

why-should-the-country-apologize-for-the-bjps-racist-remarks-ktr
X

బిజెపి మతోన్మాదులు ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే అంతర్జాతీయ సమాజానికి భారతదేశం ఎందుకు క్షమాపణలు చెప్పాలి? అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రధానిని ప్రశ్నించారు.

బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు భారత ప్రభుత్వం అంతర్జాతీయ సమాజానికి క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో కేటీఆర్ ఈ విధంగా వరస ట్వీట్లు చేశారు. ఆయన తన ట్వీట్లను నరేంద్ర మోడీకి ట్యాగ్ చేశారు.

ఆయన ఇంకా తన ట్వీట్ లో…. ”క్షమాపణ చెప్పాల్సింది భారత దేశం కాదు బీజేపీ. రోజు విడిచి రోజు విద్వేషాన్ని చిమ్ముతున్నందుకు, వ్యాప్తి చేస్తున్నందుకు మీ పార్టీ ముందుగా భారతీయులకు క్షమాపణ చెప్పాలి” అని కేటీఆర్ తన ట్వీట్ లో డిమాండ్ చేశారు.

మహాత్మా గాంధీ హత్యను బిజెపి ఎంపి ప్రజ్ఞా సింగ్ ప్రశంసించినప్పుడు మీరు మౌనంగా ఉండటం నాకు దిగ్భ్రాంతి కలిగించింది. అని అన్నారాయన‌

మీరు అనుమతి ఇచ్చిన దానినే మీ నాయకులు ప్రచారం చేస్తారు. పై నాయకత్వం నుంచి వచ్చే నిశ్శబ్ద మద్దతే మతోన్మాదాన్ని, ద్వేషాన్ని ప్రోత్సహిస్తోంది. ఇది దేశానికి కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుంది అని కేటీఆర్ మండిపడ్డారు.

ఇదిలావుండగా, ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆదివారం సస్పెండ్ చేయడంతోపాటు ఢిల్లీ మీడియా హెడ్ నవీన్ కుమార్ జిందాల్‌ను ఆ పార్టీ బహిష్కరించింది.

ఇస్లాం స్థాపకుడు ప్రవక్తను ఉద్దేశించి ఒక టీవీ చర్చ సందర్భంగా నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు, నవీన్ కుమార్ అభ్యంతరకరమైన ట్వీట్లు ముస్లిం సమూహాల ఆగ్రహానికి దారితీసాయి. వారి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కొన్ని దేశాల్లో నెటిజనులు భారతీయ ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై అరబ్ దేశాలతో సహా పలు దేశాలు తీవ్రంగా స్పందించాయి. ఈ నేపథ్యంలో భారత్ అంతర్జాతీయ సమాజానికి క్షమాపణ చెప్పింది.

First Published:  6 Jun 2022 4:03 AM GMT
Next Story