Telugu Global
National

సిగ్గు సిగ్గు.. వలస కూలీల సైకిళ్ల వేలం..

ఆనాటి అసమర్థతను ఈనాడు మరోసారి నిస్సిగ్గుగా బహిరంగ పరచుకుంది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. కరోనా లాక్ డౌన్ సమయంలో వలస కూలీల కష్టాలు తీర్చలేక, వారికి రవాణా సౌకర్యాలు కల్పించలేక చేతులెత్తేసిన యూపీ ప్రభుత్వం, ఇప్పుడు వారు వదిలేసి వెళ్లిన సైకిళ్లను వేలం వేసి 21 లక్షల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకుంది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది సరే, దేశవ్యాప్తంగా ప్రభుత్వ పరువు మంటగలిసినట్టయింది. ఎందుకు వేలం వేశారు..? 2020 లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా చాలా మంది కూలీలు […]

సిగ్గు సిగ్గు.. వలస కూలీల సైకిళ్ల వేలం..
X

ఆనాటి అసమర్థతను ఈనాడు మరోసారి నిస్సిగ్గుగా బహిరంగ పరచుకుంది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. కరోనా లాక్ డౌన్ సమయంలో వలస కూలీల కష్టాలు తీర్చలేక, వారికి రవాణా సౌకర్యాలు కల్పించలేక చేతులెత్తేసిన యూపీ ప్రభుత్వం, ఇప్పుడు వారు వదిలేసి వెళ్లిన సైకిళ్లను వేలం వేసి 21 లక్షల రూపాయల ఆదాయాన్ని సమకూర్చుకుంది. ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది సరే, దేశవ్యాప్తంగా ప్రభుత్వ పరువు మంటగలిసినట్టయింది.

ఎందుకు వేలం వేశారు..?
2020 లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా చాలా మంది కూలీలు తమ సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఉత్తర ప్రదేశ్ లో వలస కూలీలు తమ సైకిళ్లను సహరణ్ పూర్‌ ప్రాంతంలోని ఓ పార్కింగ్ ప్రదేశంలో వదిలి వెళ్లారు. సహరణ్‌ పూర్ జిల్లా కేంద్రంగా ఉంది. ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు ఇదే అనువైన కూడలి. అందుకే వలస కార్మికులంతా అక్కడికి సైకిళ్ల ద్వారా వచ్చి.. అక్కడినుంచి ప్రైవేటు వాహనాలతో అవస్థలు పడ్డారు. మరి కొందరు రైల్వే ట్రాక్ వెంబడి నడక మొదలు పెట్టారు. అలా వలస కూలీలు వదిలి వెళ్లిన సైకిళ్లు 14600 అక్కడే ఉండిపోయాయి. కొంతమంది తిరిగొచ్చిన తర్వాత ఆధారాలు చూపించి సైకిళ్లను తీసుకుపోగా.. 5400 సైకిళ్లు మిగిలిపోయాయి. ఎండకు ఎండి.. వానకు తడిచి అవి పాడైవుతున్నాయి. దీంతో ప్రభుత్వం స్పందించి వేలం వేసింది.

వేలం వేస్తే తప్పేంటి..?
సైకిళ్లను వేలం వేసి వృథాగా పడిపోయిన వాటితో ఆదాయం సమకూర్చుకోవడం మంచిదే. కానీ ప్రభుత్వ అసమర్థతకు ఇంతకంటే వేరే నిదర్శనం ఇంకేం కేవాలి. 5400 సైకిళ్లు అక్కడే ఉండిపోయాయంటే, కనీసం వాటి కోసం ఎవరూ తిరిగి రాలేదంటే.. వలస కూలీలకు ఎంత అభద్రతా భావం ఉందో అర్థం చేసుకోవచ్చు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే కాదు, కేంద్రం అకస్మాత్తుగా తీసుకుంటున్న అసమర్థ నిర్ణయాల వల్లే వలస కూలీలు ఎక్కడికక్కడ సొంత ప్రాంతాల్లో ఉండిపోయారు. వలస కూలీలకు రవాణా సౌకర్యాలు కూడా కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవడంతో.. రెండోసారి నమ్మి వచ్చేందుకు ఎవరూ సాహసం చేయలేదు. అందుకే సైకిళ్లన్నీ అక్కడే ఉండిపోయాయి. అయితే ఈ సైకిళ్లను ఇప్పుడు వేలం వేసి, ప్రభుత్వం సొమ్ము చేసుకోవడంతో మరోసారి వలస కార్మికుల కష్టాలు అందరికీ గుర్తొస్తున్నాయి.

First Published:  5 Jun 2022 8:30 PM GMT
Next Story